డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వాటర్‌ బాటిళ్లు !! 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న వాటర్‌ బాటిళ్లు !! 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు

Phani CH

|

Updated on: Jan 12, 2024 | 9:37 PM

ప్రపంచాన్ని కలవరపెడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువుల సమస్య.. ఊహించినదాని కన్నా ఎక్కువగానే ఉందని తాజా పరిశోధనలో తేలింది. ఇదిప్పుడు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. తాజాగా అమెరికాలోని కొలంబియా క్లైమేట్‌ స్కూల్‌కు చెందిన లామోంట్‌ డోహర్తి ఎర్త్‌ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు వాటర్‌ బాటిల్స్‌లో ప్లాస్టిక్‌ రేణువుల ప్రభావంపై పరిశోధన చేశారు. ఒక లీటరు వాటర్‌ బాటిల్‌లో దాదాపు 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నాయని తేల్చింది.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువుల సమస్య.. ఊహించినదాని కన్నా ఎక్కువగానే ఉందని తాజా పరిశోధనలో తేలింది. ఇదిప్పుడు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. తాజాగా అమెరికాలోని కొలంబియా క్లైమేట్‌ స్కూల్‌కు చెందిన లామోంట్‌ డోహర్తి ఎర్త్‌ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు వాటర్‌ బాటిల్స్‌లో ప్లాస్టిక్‌ రేణువుల ప్రభావంపై పరిశోధన చేశారు. ఒక లీటరు వాటర్‌ బాటిల్‌లో దాదాపు 2.4 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నాయని తేల్చింది. గతంలో వేసిన అంచనాల కన్నా ఇది 10 నుంచి 100 రెట్లు అధికం. గతంలో ఒకింత పెద్ద ప్లాస్టిక్‌ రేణువులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, అందువల్ల వాటి ఉద్ధృతిపై సరైన నిర్ధారణకు రాలేదని పరిశోధకులు తెలిపారు. ప్రధానంగా పాలీఇథలీన్‌ టెరెప్టలేట్‌ పెట్‌ తాకిడి ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వాటర్‌ బాటిళ్లు తయారయ్యేది ఈ పదార్థంతోనే. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి ఏటా 400 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరువవుతోంది. ఏటా 30 మిలియన్‌ టన్నుల కన్నా ఎక్కువగా నేల లేదా నీటిలో పారేస్తున్నారు. ఈ ప్లాస్టిక్‌ పదార్థాలు కాలక్రమంలో విచ్ఛిన్నమైనప్పుడు చిన్నపాటి రేణువులను వెదజల్లుతుంటాయి. సింథటిక్‌ వస్త్రాలు సహా ప్లాస్టిక్‌తో తయారైన అనేక పదార్థాలు.. వినియోగంలో ఉండగానే సూక్ష్మరేణువులను విడుదల చేస్తుంటాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పప్పుతో గ్యాస్ ట్రబులా.. అయితే ఇలా చేయండి

ఇక్కడ పోస్ట్‌ ఆఫీసు రాత్రి వేళ కూడా పని చేస్తుంది

అయ్యప్ప భక్తులకు స్పాట్‌ బుకింగ్‌ రద్దు

38 విమానాలు, 300 కార్లు సొంతం, రూ.3 లక్షల కోట్ల ఆస్తి

శ్రీరాముడిపై భక్తి.. 1001 మందికి ఫ్రీగా పచ్చబొట్లు