అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్ రద్దు
శబరిమలలో భక్తలు రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా క్యూలైన్లలో బారులు తీరారు. మణికంఠుడి దర్శనానికి 10 గంటలు సమయం పడుతోంది. శరణు శరణంటూ భక్తుల శరణుఘోషతో అయ్యప్పకొండ మార్మోగుతోంది. భక్తులు స్వామివారి దర్శన సమయం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బుధవారం నుంచి స్పాట్ బుకింగ్ రద్దు చేసింది ట్రావెన్‌కోర్ బోర్డు.
శబరిమలలో భక్తలు రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా క్యూలైన్లలో బారులు తీరారు. మణికంఠుడి దర్శనానికి 10 గంటలు సమయం పడుతోంది. శరణు శరణంటూ భక్తుల శరణుఘోషతో అయ్యప్పకొండ మార్మోగుతోంది. భక్తులు స్వామివారి దర్శన సమయం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బుధవారం నుంచి స్పాట్ బుకింగ్ రద్దు చేసింది ట్రావెన్‌కోర్ బోర్డు. అలాగే మకరజ్యోతి దర్శనానికి మహిళలు, చిన్నపిల్లలు రావద్దని సూచించింది. ఇంకోవైపు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్నవారికే దర్శనం కల్పించనున్నట్టు తెలిపింది. అంతేకాదు, జనవరి 14న 40 వేలమందికి, జనవరి 15వ తేదీన 50 వేలమందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్టు తెలిపింది. భక్తులు సహకరించాలిన సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
38 విమానాలు, 300 కార్లు సొంతం, రూ.3 లక్షల కోట్ల ఆస్తి
శ్రీరాముడిపై భక్తి.. 1001 మందికి ఫ్రీగా పచ్చబొట్లు
ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. ఆ ఛార్జీలు పెంచేసిందిగా !!