కాశ్మీర్‌కు ఏమైంది ?? గుల్మార్గ్‌లో కనిపించని మంచు !!

కాశ్మీర్‌కు ఏమైంది ?? గుల్మార్గ్‌లో కనిపించని మంచు !!

Phani CH

|

Updated on: Jan 11, 2024 | 9:30 PM

శీతాకాలం అంటే ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రాంతం.. కశ్మీర్. వింటర్​లో మంచు దుప్పటిలో కూరుకుపోయి.. కశ్మీర్​ లోయ అందాలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలోనే ఇక్కడి టూరిస్ట్​ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడిపోతూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైనది.. గుల్మార్గ్​. శీతాకాలంలో ఈ ప్రాంతం అందాలు రెట్టింపు అవుతాయి. అందరి బకెట్​ లిస్ట్​లో కచ్చితంగా ఉండే పేరు ఈ గుల్మార్గ్​. అలాంటి గుల్మార్గ్​లో ప్రస్తుతం మంచు కురవడం లేదు!

శీతాకాలం అంటే ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రాంతం.. కశ్మీర్. వింటర్​లో మంచు దుప్పటిలో కూరుకుపోయి.. కశ్మీర్​ లోయ అందాలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలోనే ఇక్కడి టూరిస్ట్​ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడిపోతూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైనది.. గుల్మార్గ్​. శీతాకాలంలో ఈ ప్రాంతం అందాలు రెట్టింపు అవుతాయి. అందరి బకెట్​ లిస్ట్​లో కచ్చితంగా ఉండే పేరు ఈ గుల్మార్గ్​. అలాంటి గుల్మార్గ్​లో ప్రస్తుతం మంచు కురవడం లేదు! శీతాకాలం సగం గడిచిపోయినా.. అక్కడ ఇప్పటికీ హిమపాతం సరిగ్గా లేకపోవడం.. అటు పర్యాటకులను, ఇటు టూరిజంపై ఆధారపడి జీవిస్తున్న వ్యాపారులను కలవరపెడుతోంది. గుల్మార్గ్​లో ప్రస్తుతం డ్రై స్పెల్​ కొనసాగుతోంది. మంచు కురువక.. అక్కడి ప్రకృతి ప్రదేశాలు వెలవెలబోతున్నాయి. పర్యాటకంపై ఈ ఎఫెక్ట్​ ఇప్పటి వరకు పడలేదు కానీ.. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్​ లోయలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కశ్మీర్​ టూరిజంలో గుల్మార్గ్​కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎల్​ఓసీకి అతి సమీపంలో ఉండే ఈ ప్రాంతం.. పీర్​ పంజల్​ పర్వతాల కిందకు వస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌన వ్రతం !!

ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా ?? మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..

అమెరికా వైట్‌ హౌస్‌ గేటును ఢీకొట్టిన కారు..

పండక్కి గుడ్‌ న్యూస్‌.. ఓటీటీలోకి నితిన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ??

ఇంట్రెస్టింగ్‌ !! నవ్వుల బ్రహ్మ జీవితం చరణ్‌ చేతిలో..