ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా ?? మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..

ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా ?? మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..

Phani CH

|

Updated on: Jan 11, 2024 | 9:28 PM

మనం అప్పుడప్పడూ కొన్ని పుకార్లు వింటూ ఉంటాం.. వినడమే కాదు అవి పాటించకపోతే ఏదో కీడు జరుగుతుందని భయపడి వెంటనే వాటిని ఆచరిస్తాం. తాజాగా మళ్లీ అలాంటిదే ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో మహిళలంతా గాజుల దుకాణాలకి క్యూ కడుతున్నారు. అసలు విషయం ఏంటంటే... ఈ సంక్రాంతికి ఒక మగ పిల్లవాడు ఉన్న తల్లులు ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లి వద్దనుంచి డబ్బులు తీసుకొని గాజులు కొని వేసుకోవాలట.

మనం అప్పుడప్పడూ కొన్ని పుకార్లు వింటూ ఉంటాం.. వినడమే కాదు అవి పాటించకపోతే ఏదో కీడు జరుగుతుందని భయపడి వెంటనే వాటిని ఆచరిస్తాం. తాజాగా మళ్లీ అలాంటిదే ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో మహిళలంతా గాజుల దుకాణాలకి క్యూ కడుతున్నారు. అసలు విషయం ఏంటంటే… ఈ సంక్రాంతికి ఒక మగ పిల్లవాడు ఉన్న తల్లులు ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లి వద్దనుంచి డబ్బులు తీసుకొని గాజులు కొని వేసుకోవాలట. అలా చేయకపోతే కీడు జరుగుతుందనే ప్రచారం ప్రస్తుతం జోరందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్… ఈ ప్రచారం ఇప్పటికే పల్లెలు, పట్టణాలన్నా తేడాలేకుండా ప్రతీ ఇంటికీ చేరింది.. ఇంకేముంది… ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకున్న తల్లులు పరుగులు పెడుతున్నారు.. వారి వద్ద డబ్బులు తీసుకొని గాజులు వేసుకొని కీడు తొలగిపోవాలని వేడుకుంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు కీడు వచ్చిందని… అందు కోసమే ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువమంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలని.. ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా వైట్‌ హౌస్‌ గేటును ఢీకొట్టిన కారు..

పండక్కి గుడ్‌ న్యూస్‌.. ఓటీటీలోకి నితిన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ??

ఇంట్రెస్టింగ్‌ !! నవ్వుల బ్రహ్మ జీవితం చరణ్‌ చేతిలో..