అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌన వ్రతం !!

అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌన వ్రతం !!

Phani CH

|

Updated on: Jan 11, 2024 | 9:29 PM

నాడు శబరిలోని విశ్వాసం.. శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం.. రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని, తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఆమెకు ఆహ్వానం అందింది.

నాడు శబరిలోని విశ్వాసం.. శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం.. రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని, తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఆమెకు ఆహ్వానం అందింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ పరిధిలోని కరమ్‌తాండ్‌లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టారు. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేశారు. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన రోజున రామ్, సీతారాం అంటూ సరస్వతి మౌన దీక్ష విరమించనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా ?? మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..

అమెరికా వైట్‌ హౌస్‌ గేటును ఢీకొట్టిన కారు..

పండక్కి గుడ్‌ న్యూస్‌.. ఓటీటీలోకి నితిన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ??

ఇంట్రెస్టింగ్‌ !! నవ్వుల బ్రహ్మ జీవితం చరణ్‌ చేతిలో..