శ్రీరాముడిపై భక్తి.. 1001 మందికి ఫ్రీగా పచ్చబొట్లు

శ్రీరాముడిపై భక్తి.. 1001 మందికి ఫ్రీగా పచ్చబొట్లు

Phani CH

|

Updated on: Jan 11, 2024 | 9:35 PM

అయోధ్య రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ మేరకు కొంతమంది భక్తులు తమ సాయంగా ఉడతాభక్తిని ప్రదర్శించుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన రాజేంద్ర అనే యువకుడు 1,001 మంది ఉచితంగా రామనామాలను టాటూగా వేయాలని నిర్ణయించుకున్నాడు.

అయోధ్య రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ మేరకు కొంతమంది భక్తులు తమ సాయంగా ఉడతాభక్తిని ప్రదర్శించుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన రాజేంద్ర అనే యువకుడు 1,001 మంది ఉచితంగా రామనామాలను టాటూగా వేయాలని నిర్ణయించుకున్నాడు. టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేసే రాజేంద్ర.. తన దగ్గరకు వచ్చే భక్తులకు ఉచితంగా శ్రీరామ్ నామాన్ని టాటూగా వేస్తున్నాడు. రాముడి చిత్రాలను అందంగా చేతులు, ఛాతి, భుజాలపై డిజైన్‌ చేస్తున్నాడు. ఈ ఆఫర్ కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పచ్చబొట్టు వేయించుకునేందుకు రామభక్తులు క్యూలు కడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నా ఏం పర్లేదు అన్నట్లు వెయిట్ చేసి మరీ టాటూ వేయించుకుని భక్తిని చాటుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. ఆ ఛార్జీలు పెంచేసిందిగా !!

అయోధ్యలో రాముడి విగ్రహం ఊరేగింపు రద్దు

కాశ్మీర్‌కు ఏమైంది ?? గుల్మార్గ్‌లో కనిపించని మంచు !!

అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఆమె మౌన వ్రతం !!

ఈ సంక్రాంతి మహిళలకు కీడు చేస్తుందా ?? మగపిల్లల తల్లులను పరుగులు పెట్టిస్తున్న గాజులు..