పప్పుతో గ్యాస్ ట్రబులా.. అయితే ఇలా చేయండి
పప్పు ధాన్యాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి నాన్ వెజ్ తినని వారికి బెస్ట్ ఆల్టర్నేట్ ఫుడ్ గా చెప్పవచ్చు. బీన్స్, బఠానీ, చిక్కుళ్లు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటివి భారతీయ ఆహారంలో అగ్రస్థానం పొందాయి. ఇవి లేని ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో పప్పులను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు.
పప్పు ధాన్యాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి నాన్ వెజ్ తినని వారికి బెస్ట్ ఆల్టర్నేట్ ఫుడ్ గా చెప్పవచ్చు. బీన్స్, బఠానీ, చిక్కుళ్లు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటివి భారతీయ ఆహారంలో అగ్రస్థానం పొందాయి. ఇవి లేని ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో పప్పులను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ఎందుకంటే అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ప్రోటీన్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. అయితే పప్పులు తిన్న తర్వాత చాలా మందికి గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. పప్పులలో పెద్ద మొత్తంలో అజీర్ణ కార్బోహైడ్రేట్లు, ఫైటిక్ యాసిడ్ ఉంటాయి. అందువల్ల పప్పులను తిన్నాక గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పప్పును వండే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకూ ఈ గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. బీన్స్‌ను ఉపయోగించే ముందు కనీసం 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల బీన్స్ లోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. పప్పులు, చిక్‌పీస్ వంటి పప్పులను 48 గంటల పాటు మొలకెత్తిస్తే సులభంగా జీర్ణమవుతాయి. పప్పులు వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువ సేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. పప్పు తిన్న తర్వాత వీలైనంత ఎక్కువ దూరం నడవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక్కడ పోస్ట్ ఆఫీసు రాత్రి వేళ కూడా పని చేస్తుంది
అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్ రద్దు
38 విమానాలు, 300 కార్లు సొంతం, రూ.3 లక్షల కోట్ల ఆస్తి
శ్రీరాముడిపై భక్తి.. 1001 మందికి ఫ్రీగా పచ్చబొట్లు
ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. ఆ ఛార్జీలు పెంచేసిందిగా !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

