Ayodhya: అయోధ్య అడుగు అడుగలో అందమే.. సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు
అయోధ్యానగరి ఐదు శతాబ్దాల తర్వాత కొత్త శోభను సంతరించుకుంటోంది. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం వడివడిగా పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు రెడీ అవుతోంది. దాంతో.. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం యూనిఫాం కలర్ కోడ్, యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తూ.. చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దుతోంది.
బాల రామయ్య తన జన్మ స్థలంలో కొలువుదీరే సమయానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దీంతో జగమంతా రామ మయం అన్న చందంగా ఎక్కడ చూసినా రామ మందిర ముచ్చట్లే.. ఏ నోట వున్నా రామ నామ స్మరణే.. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. మరో 10 రోజుల్లో భారత్‌లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. కన్నుల పండుగగా జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టం వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఇక.. అయోధ్యానగరి ఐదు శతాబ్దాల తర్వాత కొత్త శోభను సంతరించుకుంటోంది. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం వడివడిగా పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు రెడీ అవుతోంది. దాంతో.. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం యూనిఫాం కలర్ కోడ్, యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తూ.. చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దుతోంది.
ఒకరకంగా చెప్పాలంటే.. అయోధ్య నగరంలో ఇప్పుడు రామాలయం ఒక్కటే కాదు.. ప్రతి ఇంటా, ప్రతి అడుగులోనూ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా జరుగుతున్న పనులు, ఇప్పటికే పూర్తి చేసుకున్న ఆలయ పనులు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..