AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వజ్రల కోసం దేవాలయంలోని పచ్చల బండని ధ్వసం చేసిన దుండగులు..

అతి ప్రాచీన పురాతన చారిత్రాత్మక ఆలయాలలో వజ్రవైఢూర్యాలు దాచిపెట్టి ఉంటారనే మూఢనమ్మకంతో... అలాంటి ఆలయాలపై దుండగులు విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారు దోచుకునే ప్రయత్నంలో పురాతన చారిత్రాత్మక ప్రతిమలను ధ్వంసం చేస్తున్నారు అలాంటి సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది

Andhra Pradesh: వజ్రల కోసం దేవాలయంలోని పచ్చల బండని ధ్వసం చేసిన దుండగులు..
Chori In Temple
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Jan 12, 2024 | 6:04 PM

Share

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట గ్రామంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రాచీన పురాతన చారిత్రాత్మక ఆలయం. ఇలాంటి ఆలయంలో నిర్మాణ దశలో వజ్ర వైడూర్యాలు పెట్టి ఉంటారనే మూఢనమ్మకంతో ఆలయంలో దొంగతనం జరిగిన ఘటన వెలుగు చూసింది. వజ్రాలు ఉన్నాయని దేవాలయం పై భాగంలో ఉండే బొంగరం లాంటి ప్రతిమను బద్దలు కొట్టారు గుర్తుతెలియని దుండగులు. రాత్రి ఈ ఘటన జరగడంతో తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించి విషయం తెలుసుకున్న బీజేపీ  నాయకులు, వెల్దుర్పి మండలాధ్యక్షుడు రామనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను కూడదీసుకుని పోలీసుల దృష్టికి తీసుకెల్తున్నారు. వెల్దుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాముళ్ళ కోటకు జిల్లాలో ప్రత్యేకమైన ఓ పేరు ఉంది. గతంలో కర్నూలు జిల్లా కాక మునుపు రామళ్లకోట జిల్లా కేంద్రంగా కొనసాగింది. అలాంటి గ్రామంలో పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం కు ఒక చరిత్ర ఉన్నది. ఆ దేవాలయంలో పచ్చల బండ ఉన్నది . చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా తప్పు చేసినవారు ఆ పచ్చల బండపై నిలబడి ప్రమాణం చేసినచో నిజం చెప్పే వారికి ఏమి జరగదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అని దేవాలయంలో ఒక నమ్మకం. అలాంటి దేవాలయంలో దొంగతనం జరిగింది.  ఆ పచ్చల బండ పైన ఉన్న గోపురాన్ని పగలకొట్టి విలువైన నిధుల కోసం వెదికినట్లు తెలుస్తోంది. దీంతో ఏమి జరుగుతుందో అంటూ ప్రజలు భయంభ్రాంతులకు గురవుతున్నారు. దేవాలయం పై భాగాన ఉండే బొంగరం లాంటి ప్రతిమలో వజ్రాలుంటాయన్న అనుమానంతో గుర్తుతెలియని దుండగులు ప్రతిమని బద్దల గొట్టి ఎత్తుకుపోయినట్టు సమాచారం. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..