Double Decker Train: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. డబుల్ డెకర్ రైలు పొడగింపు..
ఇందులో భాగంగా.. విశాఖ- విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్‌ను గుంటూరు వరకూ పొడిగించారు. విజయవాడ-హుబ్బళ్లి అమరావతి ఎక్స్ ప్రెస్ ను నర్సాపూర్ వరకూ, నంద్యాల-కడప ఎక్స్ ప్రెస్ రైలును రేణిగుంట వరకు పొడిగించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్త తెలిపింది. ఏపీలో మూడు రైళ్ల సర్వీసులను పొడగించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఈ సేవలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన గుంటూరు రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ఈ మూడు రైళ్ల సేవల పొడిగింపును ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌తో సమానంగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ పెరుగుతోందని వివరించారు.
ఇక పొడగింపులో భాగంగా.. విశాఖ- విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్‌ను గుంటూరు వరకూ పొడిగించారు. విజయవాడ-హుబ్బళ్లి అమరావతి ఎక్స్ ప్రెస్ ను నర్సాపూర్ వరకూ, నంద్యాల-కడప ఎక్స్ ప్రెస్ రైలును రేణిగుంట వరకు పొడిగించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. విశాఖ-విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ గురించి. విశాఖ నుంచి విజయవాడకు ప్రస్తుతం ఈ డబుల్ డెకర్ రైలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మంచి సౌకర్యాలతో కూడిన ఈ డబుల్ డెకర్ రైలు ఇప్పటివరకూ విశాఖ నుంచి విజయవాడ వరకే వెళ్తుండగా ఇకపై గుంటూరు వరకు వెళ్లనుంది.
విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం (22701/22702) మధ్య నడిచే ఈ డబుల్ డెకర్ రైలు.. విశాఖపట్నం నుంచి ఉదయం 05.20 గంటలకు బయలుదేరి 11:25 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 11:25 గంటలకు బయలుదేరి 11.35 గంటలకు గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో రైలు నం.22702 గుంటూరు-విజయవాడ- విశాఖపట్నం గుంటూరులో 16.00 గంటలకు బయలుదేరి 17.05 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 17.15 గంటలకు బయలుదేరి 22..22 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలో ఆగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..