Big News Big Debate: వై నాట్‌ 175.. సీఎం జగన్‌ ఈక్వేషన్లు మారుతున్నాయా?

వై నాట్‌ 175 నినాదంతో వస్తున్న అధికారపార్టీ వైసీపీ అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. వ్యక్తుల చుట్టూ తిరిగే ప్రాంతీయపార్టీలకు భిన్నంగా.. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంతో పాటు సామాజిక న్యాయం నినాదంతో వస్తున్నారు. ప్రత్యర్ధుల కంటే ముందే జాబితాలు ప్రకటిస్తున్న సీఎం జగన్‌ మరి ఆశించిన విధంగా విజయతీరాలకు చేరుకుంటారా?

Big News Big Debate: వై నాట్‌ 175.. సీఎం జగన్‌ ఈక్వేషన్లు మారుతున్నాయా?
Big News Big Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 12, 2024 | 6:58 PM

రెండు నెలల్లో జరగనున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైపీపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. ప్రస్తుతం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నాలుగో జాబితాపైనా కసరత్తు జరుగుతోంది. సామాజిక సమీకరణాలను పాటిస్తూ.. సర్వేల ఆధారంగా విజయావకాశాలున్న అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు పార్టీ పెద్దలు. మార్పులు – చేర్పుల్లో స్వల్ప అసంతృప్తులు ఉన్నా.. వారికి నచ్చజెప్పే బాధ్యతలను కూడా కోఆర్డినేటర్లకు అప్పగించారు సీఎం. మెజార్టీ నేతలు అధిష్టానం సూచనలకు అనుగుణంగా పోటీ చేస్తామంటున్నారు.

అభ్యర్ధుల ఎంపికలో కుల, స్థానిక సమీకరణాలపై దృష్టిపెట్టారు సీఎం జగన్‌. ప్రకటించిన 9 ఎంపీ సీట్లలో ఆరు బీసీలకు ఇవ్వడం ద్వారా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాయలసీమలో ప్రకటించిన కర్నూలు, అనంతపురం, హిందూపురంలో బీసీలకు చోటిచ్చారు. ఇక కొస్తాలోనూ ఏలూరు, శ్రీకాకుళం సీటు ఇవ్వడం ద్వారా బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అన్నింటికి మించి చాలాకాలంగా నాన్‌లోకల్‌ ముద్ర ఉన్న విశాఖపట్నం ఎంపీ సీటును ఉత్తరాంధ్ర సీనియర్‌ నేత బొత్స సతీమణి ఝాన్సీకి కేటాయించారు. లోకల్‌ తో పాటు.. బీసీ కోణంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. కుటుంబం కాకుండా మెరిట్‌ ప్రకారమే సీటు కేటాయించామంటోంది వైసీపీ.

జనబల, ప్రజాభిప్రాయం, సామాజిక న్యాయం అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తోంది. గతంలో అగ్రవర్ణాలు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మిగనూరు వంటి సీట్లు కూడా బీసీలకు ఇవ్వడం ద్వారా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆయా వర్గాలను ఆకట్టుకుంటాయా? క్యాస్ట్‌ ఈక్వేషప్‌ విజయతీరాలకు చేరుస్తుందా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..