AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఓ వైపు అంత్యక్రియలకు సన్నాహాలు.. ఈలోపే అంబులెన్స్ రోడ్డు గుంతలో పడడంతో లేచొచ్చిన ప్రాణం!

ఊపిరి ఆగిపోవడంతో వృద్ధుడు మృతి చెందిన విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వృద్ధుడి అంత్యక్రియలకు ఇంట్లో కుటుంబ సభ్యులు  బంధువులకు, ఇరుగుపొరుగు రెడీ చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి వృద్ధుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ టైరు గుంతలో పడింది. దీంతో వృద్ధుడు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. ఇది  కుటుంబ సభ్యులు గమనించారు. 

Viral News: ఓ వైపు  అంత్యక్రియలకు సన్నాహాలు.. ఈలోపే అంబులెన్స్ రోడ్డు గుంతలో పడడంతో లేచొచ్చిన ప్రాణం!
Haryana Man Darshan Singh
Surya Kala
|

Updated on: Jan 12, 2024 | 8:51 PM

Share

హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించి, అంత్యక్రియలు జరుపుతుండగా.. హఠాత్తుగా ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులతో పాటు ఇతర వ్యక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి ఈ వృద్ధుడికి పాటియాలా ఆసుపత్రి వైద్యులు వెంటిలేటర్‌ మీద చికిత్స నందిస్తున్నారు. అయితే ఊపిరి ఆగిపోవడంతో వృద్ధుడు మృతి చెందిన విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వృద్ధుడి అంత్యక్రియలకు ఇంట్లో కుటుంబ సభ్యులు  బంధువులకు, ఇరుగుపొరుగు రెడీ చేస్తున్నారు.

ఆస్పత్రి నుంచి వృద్ధుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ టైరు గుంతలో పడింది. దీంతో వృద్ధుడు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. ఇది  కుటుంబ సభ్యులు గమనించారు.

పాటియాలాలో ఆస్పత్రిలో చికిత్స

మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ చైర్మన్ బల్దేవ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ గత కొన్ని ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం పాటియాలాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.

ఇవి కూడా చదవండి

చికిత్స సమయంలో ఆగిన గుండె

ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న దర్శన్ సింగ్ ను గురువారం ఉదయం వైద్యులు తనిఖీ చేయగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు గుర్తించారు. వెంటనే వైద్య సిబ్బంది ఇంజక్షన్లు ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో వెంటిలేటర్‌పై నుంచి దర్శన్ సింగ్ తొలగించిన వైద్యులు అతను మరణించినట్లు ట్లు నిర్ధారించారు. అయితే ఈ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు.

అంబులెన్స్‌లో వచ్చిన కదలిక

బల్దేవ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ సింగ్ ను స్వగ్రామం పాటియాలాకు తిరిగి తీసుకువెళుతుండగా… కైతాల్‌లోని ధండ్ గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో కారు టైరు పడిపోయింది. అనంతరం వృద్ధుడి శరీరంలో కదలిక వచ్చింది. అప్పుడు తన తండ్రి చేయి ఊపినట్లు బల్దేవ్ సింగ్ గుర్తించారు.

మళ్ళీ పరిశీలించిన వైద్యులు

దర్శన్ సింగ్ ను కుటుంబీకులు మళ్ళీ వైద్యులకు చూపించారు. అప్పుడు వృద్ధుడి నాడి పరిశీలించిన వైద్యులు అతని నాడి కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు దర్శన్ సింగ్ ని పరీక్షించారు. వృద్ధుడు ఊపిరి పీల్చుకోవడం గుర్తించారు. దీంతో అక్కడ డాక్టర్.. వృద్ధుడిని కర్నాల్‌లోని రావల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

ప్రస్తుతం వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వృద్ధుడి రక్తపోటు (బీపీ) దాదాపు 80-90 ఉందని..  ఊపిరి పీల్చుకుంటున్నారని, వృద్ధుడిని బతికించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత