Viral Video: ప్రయాణీకుడి కోసం పొట్టుపొట్టున కొట్టుకున్న క్యాబ్ డ్రైవర్స్.. WWE పోరాటంలా కనిపిస్తుందంటున్న నెటిజన్లు
ఇద్దరు వ్యక్తులు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని ఎలా గొడవ పడుతున్నారో వీడియోలో చూడవచ్చు. చేతులతో పిడి గుద్దులు కురిపించుకున్నారు. మెరుపు వేగంతో కదులుతూ కొట్లాడుతున్నారు. వీరి దెబ్బలాటను ఆపడం కోసం కొంతమంది జోక్యం చేసుకోవడానికి వచ్చారు. వేయిరిద్దరూ తమ కొట్లాటను ముగించే ఉద్దేశ్యం లేదన్నట్లు కారులో వేసి కొట్టుకుంటుంటే... చివరకు పోలీసులు అక్కడికి చేరుకోవడంతో విషయం సద్దుమణిగింది.
దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో జనాభా అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు రవాణా సాధనాలుగా బస్సులు, మెట్రో, క్యాబ్‌లు వంటి వాటిని ఆశ్రయిస్తారు. ప్రస్తుతం ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణించడానికి రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బస్సులు, మెట్రోలలో ఎక్కువ రద్దీ ఉంటుంది. దీంతో కొన్ని సార్లు తమ ప్రయాణం కోసం క్యాబ్‌లను ఆశ్రయిస్తారు. సాధారణంగా యాప్ ద్వారా క్యాబ్ లను బుక్ చేసుకుంటారు. అప్పుడు ఆ క్యాబ్ నేరుగా ప్రయాణీకుల దగ్గరకు చేరుకుంటుంది. అయితే క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల కోసం తమలో తాము పోటీపడి పోరాడడం ఎప్పుడైనా చూశారా? అవును ప్రస్తుతం ఒక ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రజలు కోపంగా ఉన్నారు.
ఇద్దరు వ్యక్తులు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని ఎలా గొడవ పడుతున్నారో వీడియోలో చూడవచ్చు. చేతులతో పిడి గుద్దులు కురిపించుకున్నారు. మెరుపు వేగంతో కదులుతూ కొట్లాడుతున్నారు. వీరి దెబ్బలాటను ఆపడం కోసం కొంతమంది జోక్యం చేసుకోవడానికి వచ్చారు. వేయిరిద్దరూ తమ కొట్లాటను ముగించే ఉద్దేశ్యం లేదన్నట్లు కారులో వేసి కొట్టుకుంటుంటే… చివరకు పోలీసులు అక్కడికి చేరుకోవడంతో విషయం సద్దుమణిగింది. గొడవ పడుతున్న వారిద్దరూ క్యాబ్ డ్రైవర్లని, ప్రయాణికుల కోసం ఒకరితో ఒకరు గొడవ పడ్డారని చెబుతున్నారు. ఈ వీడియో ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాకు చెందినదిగా చెబుతున్నారు.అయితే ఈ విషయాన్ని టీవీ 9 ధృవీకరించడం లేదు.
వీడియో చూడండి
@gharkekalesh pic.twitter.com/HyEHZIj021
— Arhant Shelby (@Arhantt_pvt) January 14, 2024
క్యాబ్ డ్రైవర్ల ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది @gharkekalesh అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 37 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 45 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.
అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు, ఢిల్లీ, నోయిడా ప్రజలు ఎందుకు చాలా గొడవ పడతారో తెలియదు కానీ సర్వసాధారణం అని కామెంట్ చేశారు. ‘ఇదంతా నోయిడాలో చాలా సాధారణం’ అని మరొకరు… నోయిడాను తిడుతూ.. ‘అందుకే నోయిడా నివసించడానికి వీలు లేని చెత్త నగరాల్లో ఒకటి’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘క్యాబ్ డ్రైవర్ల మధ్య గొడవ నాకు WWE పోరాటంలా కనిపిస్తోంది.’ అని ఫన్నీ కామెంట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..