Bhogi Pallu: పండగ వేళ ఇల్లంతా కుక్కలతో సందడి.. భోగి పళ్లు పోసి విచిత్ర సంబురాలు
సహజంగా సంక్రాంతి భోగి నాడు తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బోగి పండ్లను పోసి దీవిస్తారు.. కానీ ఈ కుటుంబం పిల్లలతో పాటు పెంపుడు జంతువులు, వీధి కుక్కలకు కూడా బోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి బోగి వేడుకల్లో భాగంగా శునకాల పిల్లలకు సంప్రదాయంగా బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలను, రేగుపండ్లు బోగి పండ్లు శునకాలపై పోసి ముచ్చెట తీర్చుకున్నారు.
మానవ సంబంధాలు మంట గలుస్తున్న ఈ రోజుల్లో జంతువుల పై అపురూప ఆప్యాయతను కనబరుస్తోంది ఓ కుటుంబం. వందలాది శునకాల మద్య సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. పెంపుడు కుక్కలకు బోగి పండ్లు పోసి ముచ్చట తీర్చుకున్నారు. పండుగ వేళ ఇల్లంతా శునకాలతో సందడే. ఈ విచిత్ర సంక్రాంతి సంబరాలు మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామంలో జరిగాయి.. పింగళి దీపిక కుటుంబం జంతు ప్రేమికుల కుటుంబం.. వీరు తమ ఇంట్లో సుమారు 20కి పైగా శునకాలను పెంచుకుంటున్నారు.
సహజంగా సంక్రాంతి భోగి నాడు తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బోగి పండ్లను పోసి దీవిస్తారు.. కానీ ఈ కుటుంబం పిల్లలతో పాటు పెంపుడు జంతువులు, వీధి కుక్కలకు కూడా బోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి బోగి వేడుకల్లో భాగంగా శునకాల పిల్లలకు సంప్రదాయంగా బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలను, రేగుపండ్లు బోగి పండ్లు శునకాలపై పోసి ముచ్చెట తీర్చుకున్నారు.
భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లను తల మీద పోయడం వల్ల చెడుదృష్టి తొలగిపోయి, నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నానుడితో ఈ వేడుక చేస్తాం.. కానీ తమ ఇంట్లో ఉన్న శునకాల పిల్లలకు గత 12 సంవత్సరాలుగా బోగి పండ్లను పోస్తున్నామని, దీపిక కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విధంగా శూనకాలపై భోగిపండ్లు పోయడం వల్ల వాటిలో ఉన్న క్రూరత్వం తగ్గి ప్రేమాభిమానాలు పెరుగుతాయన్నారు.. దీపిక కుటుంబం ఈ వీధి శునకాలను తమ కుటుంబసభ్యులతో సమానంగా చూసుకోవడంతో పండుగ వేల ఇల్లంతా శునకాతో సందడిగా మారింది.
ఇంట్లోని పెంపుడు శునకాలతో పాటు వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరిగుతుండడంతో గ్రామస్తులు ఇంట్లోకి అడుగు పెట్టడానికి బయపడతారని, తమ ఇంటికి బంధువులు కూడా శునకాల భయంతో రారని, శునకాలే మాకు బంధువులని ఆ ఇంటి వారు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..