Telangana : ఇక‌పై మండలాల్లో కైట్ ఫెస్టివల్… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

3 రోజుల పాటు ఇంటర్నేఫషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగుతుంది. జాతీయ అంతర్జాతీయ కైటర్లు ఈ పతంగుల పండుగలో పాల్గొన్నారు.. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఈ పోటీలను చూసేందుకు క్యూకడుతున్నారు..కరోనా కారణం గా గత ముడు సంవత్సరాలు ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ నగరం దూరం అయింది..

Telangana : ఇక‌పై మండలాల్లో కైట్ ఫెస్టివల్... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
Telangana
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 15, 2024 | 9:43 AM

ఇండియా పతంగ్, టెడ్డీబేరే పతంగ్ అవి కూడా భారీ సైజులో ఉండే పతంగులు..ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా మన హైదరాబాద్ లో.. 3 రోజుల పాటు ఇంటర్నేఫషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగుతుంది. జాతీయ అంతర్జాతీయ కైటర్లు ఈ పతంగుల పండుగలో పాల్గొన్నారు.. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఈ పోటీలను చూసేందుకు క్యూకడుతున్నారు..కరోనా కారణం గా గత ముడు సంవత్సరాలు ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ నగరం దూరం అయింది.. ఈ సారి ముడు రోజుల పాటు అలరించిన భారీ ఈవెంట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సంక్రాంతి వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో పతంగులు ఆకాశంలో విహరిస్తుంటాయి.. ఈసారి లోకల్ పతంగులకు తోడు ఇంటర్నేషనల్ హంగులు కూడా యాడ్ అయ్యాయి.. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ డే ను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం గ్రాండ్ గా నిర్వహించిది. .. ఈ పతంగుల ఫెస్టివల్ కు 16 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషల్ ప్లేయర్లు, 60మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు..ఇండోనేషియా స్విట్జర్లాండ్, ఆష్ట్రేలియా, శ్రీలంక, కెనడా ,ఇటలీ, దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ తదితర దేశాల నుంచి ఇక్కడికి చేరకున్నారు..కరోనా తర్వాత మూడేళ్ళ పాటుఈ పోటీలను ప్రభుత్వం నిర్వహించలేదు.. తాజాగా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహన జరగడం తో ఇక్కడ పాల్గొనేందుకు,చూసేందుకు చాలా మంది పరేడ్ గ్రౌండ్ కి చేరుకుంటున్నారు.కైట్‌ ఫెస్టివల్‌ ఎగ్జిబిషన్‌కు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించింది టూరిజం శాఖ.కలర్ ఫుల్ కైట్లు, డిఫరెంట్ డిజైన్ కైట్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇండియా కైట్, టెడ్డీబేర్ పతంగ్, గద్ద పతంగ్, అయోధ్య నమూనా పతంగ్, లాంగ్ పతంగ్ తదితర పతంగులు అలరిస్తున్నాయి.. సందర్శకులు కూడా ఈ పతంగుల ఫెస్టివల్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పెద్దలు తమ చిన్నారులకు ఈ కైట్ ఫెస్ట్ ఎలా ఉంటుందో చూపించేందుకు వారిని తీసుకువస్తున్నారు. చిన్నారులు సైతం ఈ కైట్ ఎగ్జిబిషన్ ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.. సుమారు 15 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు..

ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని వచ్చే సంవత్సరం నుంచి జిల్లాల వారిగా ప్రతి మండలంలోనూ ఈ పెద్ద ఈవెంట్ ను జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.గతం లో కంటే ఈ సారి ఎక్కువగా 15 లక్షల కి పైగా పబ్లిక్ నీ అంచనా వేసిన టూరిజం శాఖ..వచ్చే సంవత్సరం నుండి ఈ భారీ ఈవెంట్ నీ ప్రతి మండలం లో నిర్వహించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని అంతటా విస్తరించే లా కార్యక్రమాలు ఉంటాయి అని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

సంక్రాంతి తో పాటు తెలంగాణ లోని పెద్ద పండుగలు అన్నిటినీ కూడా హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలోనూ టూరిజం శాఖ తరపున ఓక వేదికపై నిర్వహించి పండగలకు సొంత ఇంటికి వెళ్ళలేని వారందరికీ ఒక వైదికపై తీసుకువచ్చి పండగ వాతావరణం కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి అన్నారు.