Textile Industry: సిరిసిల్లలోని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్.. అసలు కారణం ఏంటంటే..

సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను ఈ రోజు నుండి నిరవధకంగా బంద్ చేపట్టారు. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్‎లలో పేరుకుపోయిందని, కొత్తగా నూలు దారాన్ని కొని వస్రోత్పత్తిని కొనసాగించే పరిస్థితిలో పాలిస్టర్ యజమానులు లేరని నేతన్నలు వెల్లడించారు.

Textile Industry: సిరిసిల్లలోని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్.. అసలు కారణం ఏంటంటే..
Sirisilla Polyester Industry
Follow us

| Edited By: Srikar T

Updated on: Jan 15, 2024 | 10:34 AM

సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను ఈ రోజు నుండి నిరవధకంగా బంద్ చేపట్టారు. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్‎లలో పేరుకుపోయిందని, కొత్తగా నూలు దారాన్ని కొని వస్రోత్పత్తిని కొనసాగించే పరిస్థితిలో పాలిస్టర్ యజమానులు లేరని నేతన్నలు వెల్లడించారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రం తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు.

సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ నిర్ణయంతో వేలాదిమంది పవర్లూమ్, నేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడనున్నారు. ఇప్పటికే బతకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుండి సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మందకోడిగా కొనసాగుతోంది. పరిశ్రమలో చేతినిండా పని లేక కార్మికులు అవసరమైన మేర ఉపాధిని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం.. పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న పవర్లూమ్ కార్మికుల జీవితాలను తీవ్రంగా ప్రభావం చూపనుంది.

ప్రభుత్వ ఆర్డర్లపై కొరవడిన స్పష్టత.

రాష్ట్ర ప్రభుత్వం నుండి సిరిసిల్ల పవర్‎లూమ్ పరిశ్రమకు అందించే ఆర్డర్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఆర్డర్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి తమకు ఏ ఆర్డర్లు అందలేదని పరిశ్రమల యజమానులు తెలిపారు. మరోవైపు కేవలం 600 లోపు మర మగ్గాలు నడిచే టెక్స్‎టైల్ పార్కుకు, 25 వేలకు పైగా మరమగ్గలు నడిచే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమానంగా ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడం పట్ల కూడా సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు రాకుంటే పరిశ్రమలు నడపలేమని యజమానులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాలిస్టర్ బట్టకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని బంద్ చేయడం సరికాదన్నారు జోలి శాఖ అధికారులు. దీనిపై స్పందించిన యాజమాన్యాలు ప్రభుత్వంతో అధికారులు మాట్లాడి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించకుంటే సిరిసిల్ల రానున్న రోజుల్లో ఉరిసిల్లగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫాలోమ్స్ యధావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 30 సంవత్సరాల నుంచి పవర్ లూమ్స్ నడుపుతున్నా ఎన్నడూ లేని విధంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు వస్త్ర పరిశ్రమ నిర్వాహకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..