Revanth Reddy Tour: మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటన..
మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను, సీఎం కలిసి దాదాపు 70 మందికిపైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్ సహా పలు కీలక రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందన్నారు..
భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగనుంది. మూడు రోజుల టూర్‌లో 70 మందికిపైగా పారిశ్రామిక దిగ్గజాలను కలుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా చాటి చెబుతామన్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొననుంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలిసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందన్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది చక్కటి వేదిక అన్నారు.
మూడు రోజుల దావోస్ పర్యటనలో తాను, సీఎం కలిసి దాదాపు 70 మందికిపైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్ సహా పలు కీలక రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందన్నారు. తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని, ఆయనను వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారన్నారు.
దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్‌తో సమావేశం అవుతామన్నారు శ్రీధర్ బాబు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ సదస్సు హైదరాబాద్‌లో జరగబోతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి