AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS RTC: సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డు.. ఒక్కో రోజే ఏకంగా..

సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న...

TS RTC: సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డు.. ఒక్కో రోజే ఏకంగా..
TS RTC
Narender Vaitla
|

Updated on: Jan 14, 2024 | 6:28 PM

Share

ఈ సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డును సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు సొంతూళ్లు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. మహా లక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈసారి ఆర్టీసీకి భారీ ఆదరణ లభిచింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

ఈ విషయమై సజ్జనార్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పడం జరిగింది. సంక్రాంతి సందర్బంగా 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదిల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడపగా.. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపడం జరిగింది. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పింది’ అని రాసుకొచ్చారు.

ఇక శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారని సజ్జనార్‌ పేర్కొన్నారు. వీటిలో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉండడం గమనార్హం. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారని సజ్జానర్‌ తెలిపారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందన్నారు.

ఇక తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామని తెలిపిన సజ్జనార్‌.. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..