Telangana: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్‌పై ఎన్వీఎస్‌ఎస్‌ సంచలన ఆరోపణలు..

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీజేపీ సీనియర్‌ నేత NVSS ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. నెల రోజుల్లో సీఎం రేవంత్‌..ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లారన్నారు ఎన్వీఎస్‌ఎస్‌. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు గెలిపిస్తే రేవంత్‌.. ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు బీజేపీ సీనియర్‌ నేత.

Telangana: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్‌పై ఎన్వీఎస్‌ఎస్‌ సంచలన ఆరోపణలు..
Telangana Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 14, 2024 | 9:33 PM

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీజేపీ సీనియర్‌ నేత NVSS ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. నెల రోజుల్లో సీఎం రేవంత్‌..ఆరు సార్లు ఢిల్లీకి వెళ్లారన్నారు ఎన్వీఎస్‌ఎస్‌. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు గెలిపిస్తే రేవంత్‌.. ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు బీజేపీ సీనియర్‌ నేత. కాంగ్రెస్‌ పెద్దల కనుసన్నల్లో తెలంగాణ పాలన సాగుతోందా లేక కాంగ్రెస్‌ అధిష్టానానికి కప్పం కట్టడానికి రేవంత్‌ తరచు ఢిల్లీ వెళుతున్నారా అంటూ ఎన్వీఎస్‌ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి పరిపాలన సాగిస్తే.. ఇప్పుడు రేవంత్‌ ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తున్నారంటూ ఎన్వీఎస్‌ఎస్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పంథాలోనే కాంగ్రెస్‌ పయనిస్తోందంటూ విమర్శించారు.

ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ నేత మల్లు రవి మండిపడ్డారు. ఎన్వీఎస్ఎస్‌ తన ఆరోపణలను వెనక్కి తీసుకుని సీఎం రేవంత్‌కు క్షమాపణలు చెప్పాలని మల్లు రవి డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌.. తన స్వప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడం లేదని, రాష్ట్రంలో పెండింగ్ పనులను క్లియర్ చేసుకోవడానికి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారని మల్లు రవి చెప్పారు.

పదేళ్ల పాటు కేసీఆర్ రాష్ట్రంలో పనులు చేయక, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేకపోవడంతో సమస్యలు పేరుకు పోవడంతో వాటిని క్లియర్‌ చేసేందుకే రేవంత్‌ ఢిల్లీ వెళుతున్నారన్నారు మల్లు రవి. రేవంత్‌ని ఢిల్లీ సబ్ సర్వెంట్ అని ఎన్వీఎస్‌ఎస్‌ అనడం.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ మల్లు రవి ఫైర్ అయ్యారు.

సీఎం రేవంత్‌ ఢిల్లీ టూర్లపై బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్ వార్‌ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ