AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: 20 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. అప్పట్లో ఎలా ఉండేవారో తెలుసా ?.. ఫొటో చూస్తే అస్సలు నమ్మరంతే..

కేటీఆర్‌.. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన విషయాలతో పాటు ఇతర రాజకీయ పరిణామాలు, సమాజంలో జరుగుతున్న విషయాలపై ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తూ.. చర్చిస్తుంటారు. అంతేకాకుండా.. అభిమానులకు కూడా రెగ్యూలర్‌గా రిప్లై ఇవ్వడం.. మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను సైతం ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. కేటీఆర్‌.. తన అరుదైన ఫొటోను పంచుకున్నారు.

KTR: 20 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. అప్పట్లో ఎలా ఉండేవారో తెలుసా ?.. ఫొటో చూస్తే అస్సలు నమ్మరంతే..
Ktr
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2024 | 8:45 PM

Share

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తన పదునైన మాటలతో ప్రత్యర్థుల మాటలకు చెక్ పెట్టే మంచి వాగ్దాటి.. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని.. అధికారం వరకు.. అధికారం నుంచి ప్రతిపక్షం వరకు.. ప్రాంతం ఏదైనా.. ఏ వేదికైనా అనర్గళంగా మాట్లాడటం ఆయన సొంతం.. బుల్లెట్ లాంటి మాటలు.. పదునైన విమర్శలు.. అక్కడా.. ఇక్కడా అని కాదు.. ఎక్కడున్నా.. ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.. ఆయన ఎవరో కాదు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు కే తారక రామారావు (కేటీఆర్).. అనతి కాలంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ మాస్ అండ్ డైనమిక్ లీడర్‌గా పేరు పేరుతెచ్చుకున్నారు.. అయితే, కేటీఆర్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. ఫెస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాలో చాలా చురుకుగా ఉంటారు.

కేటీఆర్‌.. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన విషయాలతో పాటు ఇతర రాజకీయ పరిణామాలు, సమాజంలో జరుగుతున్న విషయాలపై ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తూ.. చర్చిస్తుంటారు. అంతేకాకుండా.. అభిమానులకు కూడా రెగ్యూలర్‌గా రిప్లై ఇవ్వడం.. మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను సైతం ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. కేటీఆర్‌.. తన అరుదైన ఫొటోను పంచుకున్నారు. 20 ఏళ్ల కిందటి ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేసిన కేటీఆర్‌.. అప్పట్లో అలా.. 20 ఏళ్ల క్రితం ఇలా ఉండేవాన్ని అంటూ ట్వీట్ చేశారు. కాగా.. కేటీఆర్ షేర్ చేసిన ఫొటోలో సుమారు 27 ఏళ్ల వయసు ఉంటుంది. ఈ ఫొటోలో నూనూగు మీసాలతో బ్లేజర్‌ వేసుకుని ఫార్మల్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోను బట్టి చూస్తే.. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలోనిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కేటీఆర్ ఫొటో..

ఇంకేముంది.. కేటీఆర్‌ ఫొటో షేర్‌ చేసిన నాటినుంచి నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. కేటీఆర్‌.. తెలంగాణ ఉద్యమం కంటే ముందు అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్‌.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్