AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC Corporator: జనం సొమ్ముతో జల్సా రాజకీయాలు.. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్..

వరంగల్‎లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అరెస్ట్ అయ్యారు. చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కమిట్మెంట్ చిట్టిల పేరుతో వరంగల్, హనుమకొండకు చెందిన సుమారు 100 మంది సభ్యుల నుండి 6 కోట్ల రూపాయల వరకు వసూలుచేసి సభ్యులకు చిట్టి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

GHMC Corporator: జనం సొమ్ముతో జల్సా రాజకీయాలు.. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్..
Ghmc Corporater
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 15, 2024 | 8:32 AM

Share

వరంగల్‎లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అరెస్ట్ అయ్యారు. చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కమిట్మెంట్ చిట్టిల పేరుతో వరంగల్, హనుమకొండకు చెందిన సుమారు 100 మంది సభ్యుల నుండి 6 కోట్ల రూపాయల వరకు వసూలుచేసి సభ్యులకు చిట్టి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు 1 కోటి 15 లక్షలు రికవరీ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26 వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేష్ పై గాలిపల్లి శ్రవణ్ కుమార్, తైలం గౌతమ్ సాగర్ అనే బాధితులు ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. ఇతని పై రెండు కేసులు నమోదు అయ్యాయి.

బాధితుల ఫిర్యాదు మేరకు బాలిన సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుండి ఒక కోటి పదిహేను లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతను పది సంవత్సరాల నుండి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు విలువ గల కమిట్మెంట్ చిట్టీలు నడుపుతూ చాలామంది దగ్గర నమ్మకాన్ని సంపాదించారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా నిందితుడు తన చిట్టి సభ్యుల దగ్గర వసూలు చేసిన చిట్టి డబ్బులని నష్టపోయాడు. గత వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాను కార్పొరేటర్‎గా పోటీ చేసినప్పుడు తన సొంత అవసరాలకు వాడుకున్నారు.

అతను రాజకీయంగా ఎదగడానికి, తన ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసి, చిట్టి సభ్యులు అడిగినప్పుడు వాళ్లను మభ్యపెడుతూ కాలం గడుపుతూ వచ్చారు. వాళ్ళంతా నిలదేయడంతో తన ఇంటిని అమ్మి అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. తన ఇంటిని అమ్మి ఆ డబ్బులతో కొందరికి పెమెంట్స్ చేశారు. మిగిలిన డబ్బులను తన దగ్గర పెట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్పొరేటర్‎ను అరెస్ట్ చేసి ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది