Viral Video: యువ కళాకారుల అపురూప సృష్టి.. పార్లే-జి బిస్కట్‌తో అయోధ్య రామ మందిరానికి ప్రతిరూపం

ఓ రామ భక్తుడు రామమందిర కాన్సెప్ట్‌లో డైమండ్ నెక్లెస్ తయారు చేసి వార్తల్లో నిలిచాడు. అదే విధంగా రామమందిరం నేపథ్య కేక్‌ను తయారు చేసి ఓ యువతి తన భక్తిని అపూర్వంగా ప్రదర్శించింది. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ.. రామ మందిరాన్ని ముగ్గుగా వేసి ఆకట్టుకుంటే.. తాజాగా ఓ యువకుడు బిస్కట్స్ తో రామ మందిర ప్రతి రూపాన్ని సృష్టించాడు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నగరానికి చెందిన చోటన్ ఘోష్ అనే యువకుడు 20 కిలోల పార్లే-జి బిస్కెట్లను ఉపయోగించి రామమందిరానికి అద్భుతమైన ప్రతిరూపాన్ని సృష్టించాడు.

Viral Video: యువ కళాకారుల అపురూప సృష్టి.. పార్లే-జి బిస్కట్‌తో అయోధ్య రామ మందిరానికి ప్రతిరూపం
Ram Mandir Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 17, 2024 | 6:35 PM

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి, బాల రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూసేందుకు కోట్లాది మంది రామ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు రామ భక్తులు తమ భక్తిని రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. కొంతమంది రామభక్తులు తమ ఊర్ల నుంచి కాలినడకన శ్రీరాముని దర్శనానికి బయలుదేరారు. ఓ రామ భక్తుడు రామమందిర కాన్సెప్ట్‌లో డైమండ్ నెక్లెస్ తయారు చేసి వార్తల్లో నిలిచాడు. అదే విధంగా రామమందిరం నేపథ్య కేక్‌ను తయారు చేసి ఓ యువతి తన భక్తిని అపూర్వంగా ప్రదర్శించింది. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ.. రామ మందిరాన్ని ముగ్గుగా వేసి ఆకట్టుకుంటే.. తాజాగా ఓ యువకుడు బిస్కట్స్ తో రామ మందిర ప్రతి రూపాన్ని సృష్టించాడు. వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నగరానికి చెందిన చోటన్ ఘోష్ అనే యువకుడు 20 కిలోల పార్లే-జి బిస్కెట్లను ఉపయోగించి రామమందిరానికి అద్భుతమైన ప్రతిరూపాన్ని సృష్టించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఛోటాన్ ఘోష్, అతని స్నేహితులు 20 కిలోల పార్లే జి బిస్కెట్లను ఉపయోగించి రామమందిరానికి 4-4-అడుగుల పొడవైన ఈ ప్రతి రూపాన్ని రూపొందించారు. ఈ ప్రతి రూపాన్ని తయారు చేయడానికి వీరికి ఐదు రోజులు పట్టింది. ఈ ప్రతిరూపాన్ని రూపొందించడానికి బిస్కెట్లతో పాటు థర్మాకోల్, ప్లైవుడ్, చిగుళ్లను కూడా ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించిన వీడియో @durgapur_times ఇన్‌స్టాగ్రామ్ పేజీలో “20 కిలోల బిస్కెట్‌లతో తయారు చేసిన రామమందిరం ప్రతిరూపం” అనే శీర్షికతో షేర్ చేయబడింది. వైరల్ వీడియోలో ఒక యువకుడు 20 కిలోల పార్లేజీ బిస్కెట్లను ఉపయోగించి రామమందిరం యొక్క 4-4-4-అడుగుల పొడవైన ప్రతిరూపాన్ని సృష్టించడం చూడవచ్చు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 19 మిలియన్ వ్యూస్, 2.6 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ యువకుడి ప్రతిభను నెటిజన్లు కామెంట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు. ఒకరు “చాలా బాగుంది రామ మందిరం ప్రతిరూపం” అని వ్యాఖ్యానించారు. మరొకరు వావ్ చాలా బాగుంది అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే