AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simhachalam: సింహాచల అప్పన్న ఆలయ వేడుకలో అరుదైన ఘటన.. పులకించి పోయిన భక్తులు..

శ్రీ వరహాలక్ష్మీ దేవస్థానం సన్నిధిలో జరిగే ఉత్సవాల్లో ఒకటైన గజేంద్రమోక్షం కనుమ పండుగ రోజున జరుగుతుంది. అంటే మకర వేట కోసం స్వామివారు కొండ పైన బయలుదేరి మెట్ల మార్గం ద్వారా తొలి పవంచా వద్ద నుండి పైడితల్లి అమ్మవారి గుడి వరకు, అక్కడ నుండి స్వామి వారి పూల తోటకు నాదస్వర వేద మంత్రాలతో పూల తోటకు వేంచేసి అక్కడ అధిష్టింపజేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Simhachalam: సింహాచల అప్పన్న ఆలయ వేడుకలో అరుదైన ఘటన.. పులకించి పోయిన భక్తులు..
Gajendra Moksham Veduka At Simhachalam
Eswar Chennupalli
| Edited By: Surya Kala|

Updated on: Jan 17, 2024 | 4:52 PM

Share

దేవుడి పై భక్తి, విశ్వాసం ఉన్నవాళ్లకు దైవ కార్యాలలో జరిగే కొన్ని ఘటనలు అమితాశ్చర్యాన్ని, అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇది. కనుమ పండుగ సందర్భంగా సింహాచలం లోని శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి మకర వేట లో నిర్వహించిన గజేంద్ర మోక్షం లో తారా జువ్వల ఎపిసోడ్ భక్తులందరినీ కట్టిపడేసింది. ఈ ఉత్సవంలో భాగంగా కాల్చిన తారాజువ్వలు మూడు సార్లు కూడా ముందుకు వెళ్లి వెనక్కి రావడంతో భక్తులంతా కేరింతలు కొడుతూ నిశ్చేష్టులై, ఆనంద పారవశ్యంతో అలానే నిలుచుని మంత్ర ముగ్ధులై నిలుచుని స్థాణువులా ఉండిపోయారు. అలా తారాజువ్వలు ముందుకు వెళ్ళి వెనక్కు వస్తే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని రైతాంగ ప్రగాఢ విశ్వాసం. ఉత్సవం పూర్తి కాగానే తిరిగి స్వామిని గ్రామము లో ఉన్న పుష్కరణి సత్రంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం గజేంద్ర మోక్షం

శ్రీ వరహాలక్ష్మీ దేవస్థానం సన్నిధిలో జరిగే ఉత్సవాల్లో ఒకటైన గజేంద్రమోక్షం కనుమ పండుగ రోజున జరుగుతుంది. అంటే మకర వేట కోసం స్వామివారు కొండ పైన బయలుదేరి మెట్ల మార్గం ద్వారా తొలి పవంచా వద్ద నుండి పైడితల్లి అమ్మవారి గుడి వరకు, అక్కడ నుండి స్వామి వారి పూల తోటకు నాదస్వర వేద మంత్రాలతో పూల తోటకు వేంచేసి అక్కడ అధిష్టింపజేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇవి కూడా చదవండి

ఆరాధన విశేషా ఆరాధన. మంగళ నిరంజన్ కార్యక్రమం తీర్థ ప్రసాదాలు వినియోగం జరిగిన తర్వాత భాగవతంలో ఉన్నటువంటి గజేంద్రమోక్షం ఘట్టం పారాయణం జరిగింది. ఈ కార్యక్రమం లో భగవంతుడు చాలా వాత్సల్యం కలిగినటువంటి వాడు గా దర్శనమిస్తారు. అటువంటి ఆయన వారిని వీరిని కాకుండా నోరులేని జంతువులను కూడా రక్షించేటువంటి స్వభావం దయాగుణం కలిగినటువంటి వాడుగా, జంతువు అయినటువంటి గజేంద్రుని కూడా రక్షించే దయార్ధ గుణం కలిగిన వాడు గా గోచరిస్తాడు. భగవంతుడు అనే సత్యాన్ని లోకానికి తెలియడం కోసం ఈ ఉత్సవం జరుగుతుంది అని ఆలయ స్థానాచార్యులు డాక్టర్ రాజగోపాల్ టీవీ9 తో షేర్ చేశారు. ఈ దృశ్యాలు కన్నుల పండుగగా, ఈ తతంగం అంతా వీనుల విందుగా సాగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..