AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామయ్యకు హైదరాబాద్ వాసి భారీ నైవేద్యం.. 1,265 కిలోల లడ్డూ ప్రసాదం..

రామ జన్మభూమి ఆలయంలో భూమి పూజ జరుగుతున్నప్పుడు.. తాము శ్రీ రాముడికి నైవేద్యంగా ఏమి ఇవ్వాలని అని ఆలోచినట్లు చెప్పారు. తర్వాత రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ రోజు నుండి ఆలయం తెరిచే రోజు వరకు.. తాము ప్రతి రోజు 1 కేజీ లడ్డూ చొప్పున ప్రారంభోత్సవం వరకూ లెక్కించి నైవేద్యంగా లడ్డుని ఇవ్వాలని ఆలోచించినట్లు నాగభూషణ్ రెడ్డి ANI కి చెప్పారు.

Ayodhya: రామయ్యకు హైదరాబాద్ వాసి భారీ నైవేద్యం.. 1,265 కిలోల లడ్డూ ప్రసాదం..
Aydhya Ram Mandir
Surya Kala
|

Updated on: Jan 17, 2024 | 3:14 PM

Share

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో ఐదు రోజుల్లో బాల రామయ్య గర్భ గుడిలో కొలువుదీరనున్నారు. రామయ్య కోసం భక్తులు భారీగా కానుకలను సమర్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి 1,265 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేశారు. నేడు ( జనవరి 17న) హైదరాబాద్ నుంచి లడ్డూను అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు. లడ్డూను శీతలీకరించిన గాజు పెట్టెలో పెట్టి అయోధ్యకు తీసుకుని వెళ్తున్నారు. ఈ లడ్డూను తయారు చేసేందుకు దాదాపు 30 మంది 24 గంటల పాటు నిరంతరం శ్రమించారని నాగభూషణ్ రెడ్డి తెలిపారు.

అంతేకాదు తాను 2000 నుంచి శ్రీ రామ్ క్యాటరింగ్ సర్వీస్‌ చేస్తున్నట్లు చెప్పారు. రామ జన్మభూమి ఆలయంలో భూమి పూజ జరుగుతున్నప్పుడు.. తాము శ్రీ రాముడికి నైవేద్యంగా ఏమి ఇవ్వాలని అని ఆలోచినట్లు చెప్పారు. తర్వాత రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ రోజు నుండి ఆలయం తెరిచే రోజు వరకు.. తాము ప్రతి రోజు 1 కేజీ లడ్డూ చొప్పున ప్రారంభోత్సవం వరకూ లెక్కించి నైవేద్యంగా లడ్డుని ఇవ్వాలని ఆలోచించినట్లు నాగభూషణ్ రెడ్డి ANI కి చెప్పారు.

ఇవి కూడా చదవండి

“దీంతో రామ మందిర భూమి పూజ రోజు నుంచి ప్రారంభోత్సవం వరకూ రోజులు లెక్కించి 1,265 కిలోల లడ్డూను  సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ లడ్డూను రిఫ్రిజిరేటెడ్ బాక్స్ లో పెట్టి హైదరాబాద్ నుంచి అయోధ్యకు  యాత్రగా తీసుకెళ్తున్నామని చెప్పారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రయాణించి రామయ్యకు ఈ భారీ లడ్డుని నైవేద్యంగా సమర్పించనున్నామని వెల్లడించారు. ఈ లడ్డూను తయారు చేసేందుకు దాదాపు 30 మంది 24 గంటల పాటు నిరంతరం శ్రమించారని తెలిపారు.

ఈ లడ్డూను తయారు చేసిన స్వీట్ మాస్టర్ దుషాసన్ మాట్లాడుతూ.. తాను చాలా సంతోషంగా ఉన్నానని  ఇంత పెద్ద పని చేయడం తనకు ఇదే మొదటిసారని.. చాలా కష్టపడి దీనిని తయారు చేసినట్లు తెలిపారు. అయోధ్యకు తీసుకుని వెళ్లే సమయంలో లడ్డు పాడవకుండా ఉండేలా తయారుచేసినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. అయోధ్యలో వారం రోజుల పాటు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన బుధవారం శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో శ్రీ రామ్‌లల్లా విగ్రహం పర్యటిస్తుందని వేదపండితులు ఆచార్య శ్రీ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ తెలిపారు.

జనవరి 17, బుధవారం మధ్యాహ్నం 1:20 గంటల తర్వాత జలయాత్ర, తీర్థపూజ, బ్రాహ్మణ-బతుక్-కుమారి-సువాసిని పూజ, వర్ధినీ పూజ, కలశయాత్ర, ప్రసాదం ప్రాంగణంలో ఉన్న శ్రీరామ్ లల్లా విగ్రహాన్ని సందర్శించడం జరుగుతుంది. ” శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ప్రకటనను ఉటంకిస్తూ ‘X’లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

రామాలయాన్ని జనవరి 23 నుంచి సామాన్య ప్రజల కోసం ‘దర్శనం’ కోసం తెరవనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వేలాది మంది ప్రముఖులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us