- Telugu News Photo Gallery Spiritual photos Karmanghat Hanuman Temple a symbol of devotions and serenity
Karmanghat: భాగ్యనగరంలో మహిమానిత్వ హనుమాన్ ఆలయం.. ఔరంగజేబు ఆగడాలకు అడ్డుకట్ట వేసిన స్వామి గురించి తెలుసా..!
తరచుగా తిరుపతి, శ్రీశైలం, వంటి క్షేత్రాలతో పాటు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే కాశి, కేధార్ నాథ్ వంటి తీర్ధ యాత్రలను చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. అందుకు తగిన సమయం చూసుకుని ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే మన సమీపంలో కూడా అత్యంత మహిమానిత్వ పురాతన ఆలయాలున్నాయి. ముఖ్యంగా భాగ్యనగర వాసులు తీరిక దొరికినప్పుడు పార్కులు, షాపింగ్స్ కు వెళ్ళడానికి ఆసక్తిని చూపించే సమయంలో నగరంలో ఉన్న పురాతన ఆలయాలను సందర్శించవచ్చు. ఈ రోజు అత్యంత మహిమానిత్వ ఆలయం కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం..
Sridhar Prasad | Edited By: Surya Kala
Updated on: Jan 17, 2024 | 2:29 PM

తరచుగా తిరుపతి, అరుణాచలం వంటి తీర్థయాత్రలతో పాటు కాశీ యాత్రను కూడా చేయాలని భావిస్తారు. అయితే మన ఊళ్ళోనే అది కూడా మన భాగ్యనగరంలోనే గొప్ప ప్రాచీన దేవాలయాలూ, ఎంతో ప్రాశస్థ్యాన్ని కలిగి పురాణ కథలతో కూడుకున్న ఆలాయాలున్నాయంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది.

హైదరాబాద్ లో మనకి తెలిసిన ఆలయాల వెనుక మనకి తెలియని కథలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక కథ.. కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయానికి చెందింది. 1143 వ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు వేటలో భాగంగా పులి అరుపులు విని వేటాడుతూ కర్మాన్ ఘాట్ ప్రాంతంలోకి రాగానే ఒక చెట్టు పొదలో నుండి రాం రాం అని శబ్దం వినబడింది అట. వెంటనే రాజు వెంట ఉన్న భటులు సైనికుల సహాయం తో శబ్దం వస్తున్న ప్రాంతాన్ని అంతా వెతకగా హనుమాన్ రూపంలో చెక్కి ఉన్న ఒక రాయి కనపడింది.

ఆ రాయికి పూజలు చేసిన రాజు తిరిగి తన కోటకు వెళ్ళిపోయాడు..అయితే ఒక రోజు రాత్రి ఆ రాజుకు ఆంజేనేయ స్వామి కలలో కనబడి తనకు ఆలయం కట్టాల్సిందిగా ఆదేశిస్తే కర్మాన్ ఘాట్ లో ఆలయం కట్టించాడు అని చరిత్ర చెబుతుంది.

కాగా 17 వ శతాబ్దంలో ఔరంగా జేబు దేశం అంతా తిరుగుతూ ఎన్నో ఆలయాలను ద్వంసం చేయించాడు అయితే కర్మాంఘాట్ ఆలయం వరకు వచ్చిన అతని సైనికులు గుడి కూల్చడానికి ప్రయత్నాలు చెయ్యగా చెవులు పగిలి పోయేంత శబ్దం వచ్చిందంట.

అలాంటి వింత శబ్దం విన్న ఔరంగ జేబు స్వయంగా ఆలయం దగ్గరకు రాగా నా గుడి కూలగొట్టాలి అంటే ముందు నువ్వు నీ మనసు గట్టి చేసుకో అని వినబడింది అంట. అయితే నువున్నది నిజమే అయితే కనిపించు అని ఔరంగ జేబు ప్రార్థన చెయ్యగా తాటి చెట్టంత పరిమాణంలో కాంతి పుంజాలు విరజిమ్ముతూ ఆంజనేయ విగ్రహం ఒక నిమిషం పాటు దర్శనం ఇచ్చి మాయమైంది అంట.

వెంటనే శిధిలమైన గుడిని మళ్ళీ నిర్మాణం చేసి అప్పటినుండి ఘనంగా ప్రతి రోజు పూజలు చెయ్యడం ప్రారంభించారు. ఎల్బీ నగర్ నుండి శంషాబాద్ వెళ్లే దారిలో ఉంది ఈ దేవాలయం . ఇప్పుడు కర్మాంఘాట్ హనుమాన్ దేవాలయం చాలా ఫేమస్.. ఈ గుడి గురించి తెలియని వారు నగరం లో బహుఅరుదు.





























