Online Food Order: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు.. కట్‌చేస్తే ఎలక ప్రత్యక్ష్యం! ఆ తర్వాత ఏం జరిగిందంటే

బార్బెక్యూ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. శాఖాహారి అయిన అతను ఓ రెస్టారెంట్‌ వచ్చిన డెలివరీలో చచ్చిన ఎలుక ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రాజీవ్‌ శుక్లా అనే కస్టమర్‌ ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్‌ ఆర్డర్ పెట్టాడు. జనవరి 8, 2024న ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ చైన్ బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్‌లెట్‌లో..

Online Food Order: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు.. కట్‌చేస్తే ఎలక ప్రత్యక్ష్యం! ఆ తర్వాత ఏం జరిగిందంటే
Dead Rat In Food
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 17, 2024 | 7:16 PM

ప్రయాగ్‌రాజ్‌, జనవరి 17: బార్బెక్యూ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. శాఖాహారి అయిన ఓ వ్యక్తికి ఓ రెస్టారెంట్‌ నుంచి వచ్చిన డెలివరీలో చచ్చిన ఎలుక ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రాజీవ్‌ శుక్లా అనే కస్టమర్‌ ముంబై రెస్టారెంట్ నుంచి ఫుడ్‌ ఆర్డర్ పెట్టాడు. జనవరి 8, 2024న ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్ చైన్ బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్‌లెట్‌లో వెజ్ మీల్ బాక్స్‌ను ఆర్డర్ చేశాడు. ఫుడ్‌ డెలివరీ చేసిన తర్వాత తినడం ప్రారంభించాడు. ఉన్నట్లుండి ఓ నల్లని ఆకారం మీల్‌ బాక్స్‌లో కనిపించింది. దానిని స్పూన్‌తో బయటకు తీసి చూడగా.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చచ్చిన ఎలుక అందులో ఉన్నట్లు గుర్తించాడు.

అప్పటికే కొంత తినడంతో తీవ్ర అనారోగ్యంతో 75 గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవల్సి వచ్చింది. తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరిస్తూ తన ట్విటర్‌ ఖాతాలో ఫొటోలు షేర్‌ చేశాడు. శుక్లా ఆర్డర్ రసీదు, డెలివరీ చేసిన ప్యాకేజీతో పాటు ఫుడ్‌లో వచ్చిన చచ్చిన ఎలుకకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశాడు. అతను ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అయితే దీనిపై తాను ఇంకా నాగ్‌పాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన నెట్టింత పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. పలువురు నెటిజన్లు రాజీవ్‌ శుక్లా చేసిన పోస్టుకు వివిధ అధికారుల హ్యాండిల్‌లను ట్యాగ్ చేశారు. శుక్లాకు సహాయం చేయమని వారిని కోరారు. ఇక దీనిపై బార్బెక్యూ నేషన్ స్పందించింది. ‘హాయ్ రాజీవ్. మీకు అసౌకర్యాన్ని కలిగించినందుకు చింతిస్తున్నాం. ముంబైలోని మా ప్రాంతీయ కార్యాలయం నుంచి మిస్టర్ పరేష్ మిమ్మల్ని సంప్రదించి, వివరాలు సేకరిస్తారు. మీ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామంటూ తెల్పింది. తాను తిన్న ఆహారంలో బొద్దింకలు కూడా ఉన్నాయని శుక్లా తెలిపాడు. దీంతో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో నాయర్‌ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని, ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేస్తూ బార్బెక్యూ నేషన్‌కు శుక్లా ఇమెయిల్ కూడా పంపినట్లు ది ఫ్రీ ప్రెస్ జర్నల్‌లోని ఓ నివేదిక పేర్కొంది. ఇక నెటిజన్లు మండి పడుతున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అంటూ నెట్టింట తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.