AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strongest Currency: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలు ఇవే.. అమెరికా, భారత్‌లు ఎన్నో ప్లేస్‌లో ఉన్నాయంటే

బలమైన కరెన్సీ దేశ కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దాని విశ్వసనీయతను నొక్కి చెబుతుంది. పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల జాబితాను (భారత రూపాయితో పాటు USDతో పోల్చితే) విడుదల చేసింది. వీటి ప్రాముఖ్యతకు దోహదం చేసే కారణాలను వివరించింది. 2024 జనవరి 10 నాటికి ఉన్న విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు పేర్కొంది.

Strongest Currency: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీలు ఇవే.. అమెరికా, భారత్‌లు ఎన్నో ప్లేస్‌లో ఉన్నాయంటే
Strongest Currency List
Surya Kala
|

Updated on: Jan 17, 2024 | 8:55 PM

Share

కరెన్సీ వాడుకలోకి రాక ముందు మానవ జీవితం వస్తు మార్పిడి విధానంతో సాగేది. అయితే కరెన్సీ వాడుకలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వాణిజ్యానికి జీవనాధారంగా కరెన్సీ పరిగణించబడుతుంది. అంతేకాదు దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది. ఒక బలమైన కరెన్సీ దేశంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలా శక్తివంతం చేస్తుంది. ప్రపంచ వాణిజ్యం ఇంటర్‌కనెక్టడ్ వెబ్‌లో ఆ దేశం స్థానాన్ని పటిష్టం చేస్తుంది. ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా 180 కరెన్సీలను చట్టబద్ధమైన టెండర్‌గా గుర్తించింది. కొన్ని కరెన్సీలు జనాదరణ పొందాయి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. అయితే ఈ కారకాలు తప్పనిసరిగా ఆ దేశ కరెన్సీ విలువ లేదా బలాన్ని నిర్ణయించవు.

బలమైన కరెన్సీ దేశ కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దాని విశ్వసనీయతను నొక్కి చెబుతుంది. పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీల జాబితాను (భారత రూపాయితో పాటు USDతో పోల్చితే) విడుదల చేసింది. వీటి ప్రాముఖ్యతకు దోహదం చేసే కారణాలను వివరించింది. 2024 జనవరి 10 నాటికి ఉన్న విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు పేర్కొంది. మొదటి ప్లేస్ లో కువైట్ దినార్ ఉండగా భారత కరెన్సీ రూపాయి (ఒక డాలర్‌=రూ.82.9) 15వ స్థానంలో ఉంది.

  1. ఈ జాబితాలో మొదటి స్థానంలో కువైట్ దినార్ ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. ఒక కువైట్ దినార్ మన కరెన్సీలో రూ. 270.23 (3.25 డాలర్లు)లకు సమానం.
  2. రెండో స్థానంలో బహ్రెయిన్ దినార్ ఉంది. దీని విలువ భారత  కరెన్సీలో రూ. 220.4 (2.65 డాలర్లు)
  3. ఇవి కూడా చదవండి
  4. మూడో స్థానంలో ఒమానీ రియాల్ (రూ. 215.84 , 2.60 డాలర్లు),
  5. జోర్డానియన్ దినార్ (రూ. 117.10, 1.141 డాలర్లు),
  6. జిబ్రాల్టర్ పౌండ్ (రూ. 105.52 , 1.27 డాలర్లు),
  7. బ్రిటిష్ పౌండ్ (రూ. 105.54, $1.27 డాలర్లు),
  8. కేమన్‌ దీవుల డాలర్‌ (రూ.99.76 , 1.20 డాలర్లు),
  9. స్విస్ ఫ్రాంక్ (రూ. 97.54 , 1.17 డాలర్లు)
  10. యూరో (రూ. 90.80 ,1.09డాలర్లు).
  11. అమెరికా డాలర్ (రూ. 83.10)

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..  US డాలర్ టాప్ టెన్ స్తానాల్లో చివరి స్థానం అంటే పదవ ప్లేస్ లో  ఉంది. దీని ర్యాంకింగ్‌ను వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా US డాలర్ అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న    కరెన్సీ అని ఫోర్బ్స్ తెలిపింది. డాలర్ కు అత్యంత ప్రజాదరణ ఉన్నప్పటికీ.. ఇది ప్రపంచంలోని బలమైన కరెన్సీలలో 10వ స్థానంలో ఉంది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) వెబ్‌సైట్‌లో బుధవారం ప్రచురించబడిన మారకపు రేటు ప్రకారం  భారతదేశం కరెన్సీ కు 15వ స్థానం.

అయితే కువైట్ లో దినార్ ను 1960లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా నిలకడగా ర్యాంక్ ను కొనసాగిస్తూ మొదటి ప్లేస్ లో కొనసాగుతోంది. దీనార్  కరెన్సీ బలమైన కరెన్సీగా కొనసాగడానికి కారణం కువైట్ ఆర్థిక స్థిరత్వం, దాని చమురు నిల్వలు, పన్ను రహిత వ్యవస్థ అని పేర్కొంది. అంతేకాదు స్విట్జర్లాండ్ , లిచెన్‌స్టెయిన్ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్ ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన కరెన్సీ అని ఫోర్బ్స్ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..