Telangana: ఫణిగిరిలో రాక్షస గుహల ఆనవాళ్లు.. క్రీ.పూ 4 వేల ఏళ్ల నాటివిగా గుర్తింపు..

ఆదిమానవులు తమ సమూహంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కాల్చివేసి లేదా పూడ్చిన ప్రాంతంలో ఒక రాతిబండను పేరుస్తారు. దానిపై చిన్న చిన్న బండలను ఆధారంగా ఉంచి దాని పైభాగంలో వెడల్పయిన పెద్ద రాతి బండను అమర్చేవారు. ఈలాంటి అమరికను రాక్షస గుహలు లేదా డాలమిన్‌గా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈలాంటి గుహలను సాధారణంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, స్కాండినేవియా, ఐర్లాండ్‌ దేశాల్లో పురావస్తుశాఖ అధికారులు కనుగొన్నారు. ఈలాంటి రాక్షస గుహలు మనదేశంలో కూడా ఇటీవల బయట పడుతున్నాయి.

Telangana: ఫణిగిరిలో రాక్షస గుహల ఆనవాళ్లు.. క్రీ.పూ 4 వేల ఏళ్ల నాటివిగా గుర్తింపు..
Raksha Caves
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 19, 2024 | 3:06 PM

చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా. కాకతీయ, బౌద్ధమత ఆనవాళ్లు చారిత్రక శిల్పకళా సంపదకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఈ ప్రాంతంలో రాతి, మధ్య యుగపు ఆనవాళ్లు, చిత్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా క్రీ.పూ నాలుగు వేల ఏళ్ల నాటి బృహత్‌ శిలాయుగానికి సంబంధించి ఆదిమానవులు నిర్మించిన రాక్షస గుహ బయట పడింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో ప్రఖ్యాత బౌద్ధక్షేత్రంగా విరాజిల్లింది. ఫణిగిరి సమీపంలోని గుడిబండపై క్రీ.పూ నాలుగు వేల ఏళ్ల నాటి బృహత్‌ శిలాయుగానికి సంబంధించి ఆదిమానవులు నిర్మించిన రాక్షస గుహ వెలుగు చూసింది. ఈ గుహలను తొలుత పురావస్తు శాస్త్ర అధ్యయనకారులు దుబ్బాక అరవింద్‌, ఓరుగంటి వెంకటేశ్‌ గుర్తించారు.

అయితే ఈ గుహలపై చరిత్రకారులు భిన్న రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈలాంటి గుహలను ఆదిమానవులు తమ సమావేశ స్థలాలుగా, మతపరమైన కార్యకలాపాలు నిర్వహించడం, ఖగోళ పరిశోధనలు జరపడానికి గుహలను ఉపయోగించే వారని కొందరు భావిస్తున్నారు. ఆదిమానవులు తమ సమూహంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కాల్చివేసి లేదా పూడ్చిన ప్రాంతంలో ఒక రాతిబండను పేరుస్తారు. దానిపై చిన్న చిన్న బండలను ఆధారంగా ఉంచి దాని పైభాగంలో వెడల్పయిన పెద్ద రాతి బండను అమర్చేవారు. ఈలాంటి అమరికను రాక్షస గుహలు లేదా డాలమిన్‌గా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈలాంటి గుహలను సాధారణంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, స్కాండినేవియా, ఐర్లాండ్‌ దేశాల్లో పురావస్తుశాఖ అధికారులు కనుగొన్నారు. ఈలాంటి రాక్షస గుహలు మనదేశంలో కూడా ఇటీవల బయట పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వీటిని గుర్తించారు. మహారాష్ట్రలోని నీలగిరికొండల్లో వెలుగుచూసిన డాలమిన్లను మెఘాలాతిక్‌ సమాధులుగా పిలుస్తున్నారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో కూడా వీటిని కనుగొన్నట్లు అధ్యయన కారులు తెలిపారు. నాడు ఎలాంటి యాంత్రికశక్తి లేకున్నప్పటికి ఇంత పెద్ద శిలాగుహలు నిర్మించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చరిత్ర అధ్యయనకారులు చెబుతున్నారు.

పెద్ద పెద్ద బండరాళ్లను డాలమిన్లుగా అమర్చడంలో ఆదిమానవుల శ్రమ, నైపుణ్యతకు నిదర్శనమని వీటిని ప్రశంసించకుండా ఉండలేమని వారు పేర్కొన్నారు. ఫణిగిరిలోని రాక్షసగుహలపై పురావస్తు శాఖ అధికారులు, అధ్యయనకారులు దృష్టి సారిస్తే ఈ ప్రాంతంలో బౌద్ధ మత సంస్కృతి, సంప్రదాయాలేకాక రాతియుగ కాలం నాటి ఆదిమానవుల విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశ ఉందని ఉందని దుబ్బాక అరవింద్‌, ఓరుగంటి వెంకటేశ్‌ చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..