Theatre Ads: థియేటర్స్‌లో మున్ముందు యాడ్స్ కనిపిస్తాయా.? కనిపించవా.?
థియేటర్లలో యాడ్స్ ప్లే చేయడం వల్ల తన టైమ్ వేస్ట్ అయిందంటూ బెంగుళూరు పర్సన్ ఒకరు కోర్టుకి వెళ్లారు. అక్కడ అతనికి పాజిటివ్ తీర్పు వచ్చింది. పీవీఆర్ ఐనాక్స్ కు 65 వేల రూపాయలు ఫైన్ వేసింది కోర్టు... దీన్ని బట్టి థియేటర్స్‌లో మున్ముందు యాడ్స్ కనిపిస్తాయా? కనిపించవా? ఇప్పుడు ఇదే డిస్కషన్..
Updated on: Feb 22, 2025 | 10:30 PM

థియేటర్లలో యాడ్స్ ప్లే చేయడం వల్ల తన టైమ్ వేస్ట్ అయిందంటూ బెంగుళూరు పర్సన్ ఒకరు కోర్టుకి వెళ్లారు. అక్కడ అతనికి పాజిటివ్ తీర్పు వచ్చింది. పీవీఆర్ ఐనాక్స్ కు 65 వేల రూపాయలు ఫైన్ వేసింది కోర్టు... దీన్ని బట్టి థియేటర్స్‌లో మున్ముందు యాడ్స్ కనిపిస్తాయా? కనిపించవా? ఇప్పుడు ఇదే డిస్కషన్..

థియేటర్స్‌లో యాడ్స్ ప్లే చేయడం వల్ల ప్రేక్షకుడి విలువైన సమయం వృథా అవుతుందన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ట్రాఫిక్‌ను ఈదుకుంటూ థియేటర్లకు చేరుకున్న ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నాయి ప్రకటనలు. ఇంకా సినిమా స్టార్ట్ కావడం లేదనే చిరాకు ప్రేక్షకుడిలో కలిగినప్పుడు... దాని ప్రభావం సినిమా రిజల్టు మీద పడుతుంది.

ఓటీటీల్లోనే ప్రకటనలు వద్దనుకుని ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్లు తీసుకుని సినిమాలు చూస్తున్న రోజుల్లో, థియేటర్లలో ఇలాంటి పరీక్షలు పెట్టడం అవసరమా? అనే చర్చ షురూ అయింది.

మబ్బులు చూసుకుని ముంత ఒలకబోసుకున్నట్టు... యాడ్ రెవెన్యూకి ఆశపడితే, థియేటర్లలో జనాలు పలచబడే ప్రమాదం లేకపోలేదు. కొన్ని సినిమాలు నిడివి ఎక్కువగా ఉంటోంది.

అలాంటి సందర్భాల్లో ప్రకటనల ప్రదర్శన వల్ల అదనపు భారాన్ని మోపినట్టవుతోంది. ఆ విసుగు ప్రభావం ఫుట్‌ఫాల్ మీద పడుతుంది. దీని వల్ల మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని ఎగ్జిబిటర్స్ గ్రహించాలంటున్నారు క్రిటిక్స్.