- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda fans say the countdown has started, success is guaranteed
Kingdom: కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశాం.. సక్సెస్ గ్యారంటీ: రౌడీ ఫ్యాన్స్..
కమాన్ బోయ్స్.. గెట్ రెడీ... కరెక్ట్ గా 100 రోజులే... అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తున్నారు విజయ్ దేవరకొండ. కింగ్‌డమ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశాం అన్నా.. ఈ సమ్మర్‌లో సక్సెస్ గ్యారంటీ అంటూ కోరస్ ఇచ్చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.
Updated on: Feb 22, 2025 | 11:00 PM

కమాన్ బోయ్స్.. గెట్ రెడీ... కరెక్ట్ గా 100 రోజులే... అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తున్నారు విజయ్ దేవరకొండ. కింగ్‌డమ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశాం అన్నా.. ఈ సమ్మర్‌లో సక్సెస్ గ్యారంటీ అంటూ కోరస్ ఇచ్చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.

రౌడీ హీరోకి ఫ్యామిలీ సబ్జెక్టు పర్ఫెక్ట్ గా పడితే హిట్ గ్యారంటీ అనే టాక్‌కి బ్రేక్ వేసింది ఫ్యామిలీస్టార్. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ఆ మూవీ. అందుకే మళ్లీ ఖుషీ డేస్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోంది రౌడీ సైన్యం.

ఈ సమ్మర్ మనదే రాస్కోరా సాంబా అంటూ టీజర్‌తోనే హింట్ ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. కింగ్‌డమ్ టీజర్.. అంతలా ఇన్‌స్టంట్‌గా మెప్పించింది. కథలో డెప్త్ ఉంది.. కాన్ఫిడెంట్‌గా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేయొచ్చనే టాక్ స్ప్రెడ్ అయింది.

మే 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది కింగ్‌డమ్. సిక్స్ ప్యాక్‌లో విజయ్ లుక్ ఇప్పటికే వైరల్ అవుతోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లోనూ కింగ్‌డమ్ మీద మంచి బజ్ వినిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి రౌడీ హీరోని ఎలా పోట్రే చేస్తారోననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.




