- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde gets lucky chance to repeat a Rajinikanth success pattern in coolie movie
Rajinikanth: రజనీ సక్సెస్ ప్యాటర్న్ రిపీట్.. పూజా హెగ్డేకి లక్కీ ఛాన్స్..
కష్టపడి సినిమా చేయడమే కాదు, దాన్ని అంతే ఈజీగా జనాల్లోకీ తీసుకెళ్లాలి. పబ్లిసిటీ విషయంలో ఎవరి ప్లానింగ్ వాళ్లది. రీసెంట్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫాలో అవుతున్న ఓ సక్సెస్‌ఫుల్ ప్యాటర్న్‌ని డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏంటది.. దాంతో పూజా హెగ్డేకి సంబంధం ఏంటి?
Updated on: Feb 22, 2025 | 10:00 PM

వా నువ్ కావాలయ్యా అని తమన్నా స్టెప్పులేస్తే.. మామూలు హుషారు సాంగే అనుకున్నారు. కానీ, జైలర్ సినిమాకు అంతకు ముందున్న క్రేజ్‌ని అమాంతం పెంచేసింది ఈ పాట. జైలర్‌కి ఓపెనింగ్స్ తీసుకురావడానికి సూపర్‌స్టార్ చరిష్మా ఎంత హెల్ప్ అయిందో, వా నువ్ కావాలయ్యా సాంగ్ కూడా అంతే ప్లస్ అయింది.

అదేంటోగానీ, జైలర్ తర్వాత రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతోందంటే సాంగ్ సంగతేంటీ అని ఆరా తీయసాగారు జనాలు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్ మేకర్స్.. మనసిలాయో అంటూ మంజు వారియర్‌తోనే స్పెషల్‌గా సాంగ్‌ని డిజైన్ చేశారు.

ఇప్పుడు రజనీకాంత్ కూలీలో ఏం సాంగ్ ప్లాన్ చేశారా? అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. తలైవర్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్‌గా ఎవరినైనా తీసుకొస్తారా? లేకుంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న శ్రుతిహాసన్‌తోనే కానిచ్చేస్తారా అనే డిస్కషన్ షురూ అయింది.

నాని హాయ్ నాన్నలో శ్రుతి స్టెప్పుల్ని అంత తేలిగ్గా మర్చిపోవడం లేదు జనాలు. అయితే కూలీలో శ్రుతి రోల్ చాలా పెక్యూలియర్‌గా ఉంటుందట. అందుకే సాంగ్ విషయంలో ఆమెను ఇన్వాల్వ్ చేయడం లేదు లోకేష్.

కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేకి ఛాన్స్ ఇస్తున్నారు మూవీ మేకర్స్. తలైవర్ సినిమాలో జిల్ జిల్ జిగేల్‌మనిపించే బాధ్యత ఈ సారి పూజా హెగ్డే తీసుకున్నారన్నది కోలీవుడ్‌ని ఖుషీ చేస్తున్న టాపిక్.




