Telangana: బంపర్ ఆఫర్.! ఫ్రీగా చికెన్, గుడ్లు.. బారులు తీరిన జనం.. ఎక్కడో తెల్సా..
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఈ ఫ్లూ కారణంగా ఎన్నో వేల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ తరుణంలో చికెన్ తింటే ఏమవుతుందోనని.. భయపడుతున్న జనాలకు అవగాహన కల్పించేందుకు కొన్ని సంస్థలు నడుం బిగించాయి. ఆ వివరాలు ఇలా

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శనివారం చికెన్ మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ అమ్మకాలు పడిపోవడంతో వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసం స్థానిక చికెన్ సెంటర్ యజమానులు, వెన్‌కాబ్ చికెన్ షాప్ యజమానుల ఆధ్వర్యంలో ఈ చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై చికెన్ పంపిణీ చేశారు. రెండు క్వింటల చికెన్ 65 తయారు చేశారు, 200 కోడిగుడ్లను ఉడకబెట్టి వివిధ రకాల చికెన్ వంటకాలను వండి ఉచితంగా పంపిణీ చేశారు.
మెదక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉచిత చికెన్ పంపిణీతో పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మిగుడి చికెన్ కోసం ఎగబడ్డారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో చికెన్ వంటకాలు వండడం వల్ల బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు ప్రబలవని ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి రోగాలు రావని చికెన్ తయారు చేసే క్రమంలో 70 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడికించడం వల్ల క్రిమి కీటకాలు చనిపోతాయని తద్వారా ప్రజలకు ఎలాంటి రోగాలు రావని ప్రజలకు అవగాహన కల్పించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి




