AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో

ఓ రెండేళ్ల చిన్నారికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు భయంతో పరుగు పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ డాక్టర్లు ఎక్స్ రే తీశారు. ఆ ఎక్స్ రేలో కనిపించింది చూసి డాక్టర్లు దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా..

Viral: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో
Viral News
Ravi Kiran
|

Updated on: Feb 20, 2025 | 9:05 PM

Share

వియత్నాంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రెండు వారాల క్రితం రెండేళ్ల చిన్నారి విచిత్ర పరిస్థితుల్లో ఆస్పత్రిలో జాయిన్ అయింది. అనంతరం శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు.. ఆమె కడుపులో నుంచి 27 చిన్న చిన్న అయస్కాంతాలను తొలగించారు. ఈ అయస్కాంతాల కారణంగా చిన్నారి పేగు, కడుపులో చిల్లులు పడ్డాయని డాక్టర్లు చెప్పారు.

ఫిబ్రవరి 10వ తేదీన బిన్‌హొ సిటీలో నివాసముంటున్న డికా అనే రెండేళ్ల చిన్నారి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరింది. అక్కడున్న డాక్టర్లు సదరు చిన్నారికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తీయగా.. కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన ఆమెకు ఎండోస్కోపిక్ సర్జరీ చేశారు. కడుపులో నుంచి 11 అయస్కాంతాలు తొలగించడంతో పాటు.. పేగుల మధ్య ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తీశారు. ఇక డుయోడినమ్ దగ్గర ఉన్న చిన్న ప్రేగులోకి ఇరుక్కుపోయిన మరో 8 అయస్కాంతాలను తొలగించి చిన్నారికి కుట్లు వేశారు డాక్టర్లు. దాదాపుగా 3 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సతో మొత్తం మొత్తం 27 అయస్కాంతాలను తొలగించి.. అమ్మాయికి పునర్జన్మను అందించారు డాక్టర్లు.

చిన్న పిల్లలు కావడంతో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుండటం సహజం అని డాక్టర్లు అన్నారు. కాగా, అయస్కాంతాలకు బలమైన చూషణ శక్తి ఉంటుందని, పిల్లలు వాటిలో మింగినప్పుడు, అవి పేగుల దగ్గద ఒకటికొకటి ఆకర్షించుకుని.. పేగుకు చిల్లులు, ఉదర ఇన్ఫెక్షన్ ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను బ్యాటరీలు, అయస్కాంతాలు మొదలైన చిన్న చిన్న వస్తువులతో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
సూపర్ హిట్ సినిమా టికెట్ కేవలం రూ.11 మాత్రమే
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!
భార్య ప్రియాంక సంస్కృతిని గౌరవిస్తూ నిక్ జోనస్ కొత్త ట్రెండ్!
రాణి విక్టోరియా–క్లియోపాత్రా వరకు అందరినీ ఊరించిన డిజైన్..
రాణి విక్టోరియా–క్లియోపాత్రా వరకు అందరినీ ఊరించిన డిజైన్..
మలైకా షేర్ చేసిన 5 మ్యాజికల్ మూవ్‌మెంట్స్.. ఇంట్లోనే ఫిట్‌నెస్‌
మలైకా షేర్ చేసిన 5 మ్యాజికల్ మూవ్‌మెంట్స్.. ఇంట్లోనే ఫిట్‌నెస్‌
ఫిట్‌నెస్ ప్లస్ మెంటల్ పీస్‌కు నివేధా పేతురాజ్ చెబుతున్న టిప్స్
ఫిట్‌నెస్ ప్లస్ మెంటల్ పీస్‌కు నివేధా పేతురాజ్ చెబుతున్న టిప్స్
Horoscope Today: ఆ రాశి వారు శుభవార్తలు వింటారు..
Horoscope Today: ఆ రాశి వారు శుభవార్తలు వింటారు..
మిచెలిన్ స్టార్ హోటల్‌లో ‘చాక్లెట్ థెరపీ’.. చేతులతోనే చాక్లెట్..
మిచెలిన్ స్టార్ హోటల్‌లో ‘చాక్లెట్ థెరపీ’.. చేతులతోనే చాక్లెట్..
జపాన్ జూలో పుట్టిన ‘పంచ్’ ఆవేదన.. మాతృత్వానికి దూరమైన పసి ప్రాణం
జపాన్ జూలో పుట్టిన ‘పంచ్’ ఆవేదన.. మాతృత్వానికి దూరమైన పసి ప్రాణం
ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా..
ఎన్టీఆర్ సలహాపై బాలకృష్ణ చేసిన సినిమా..
అల్లిసిన్ మ్యాజిక్.. రక్తనాళాలను క్లీన్ చేసే సహజ సిద్ధమైన మందు!
అల్లిసిన్ మ్యాజిక్.. రక్తనాళాలను క్లీన్ చేసే సహజ సిద్ధమైన మందు!