Dreams: కలలో ఆకాశంలో ఎగురుతున్నట్టు కనిపిస్తే ఏమవుతుంది.? దాని అర్ధం ఏంటంటే
మనం ప్రతీ రోజూ చేసే ఎన్నో పనులు.. మనకు ఆ రోజు కలలో వస్తుంటాయి. కలలు కొన్ని చెడ్డవి కావచ్చు. మరికొన్ని మంచివి కావచ్చు. మరి ఏ కల మంచిది.? ఏ కల చెడ్డది.. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

కలలు ఎన్నో రకాలు ఉంటాయి. ఆ రోజంతా మనం చేసిన పనులు, కలిసిన వ్యక్తులు, మనకు ఎదురైన అనుభవాలు.. ఇలా రోజు మొత్తంలో మనం చేసిన ఏ పనైనా.. కలలో రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కొందరికి ఆ ఎదురైన అనుభవాలే పీడకలలు మాదిరిగా రావచ్చు. మరికొందరికి మంచి కలలుగా ఉండొచ్చు. కొందరు కిందపడిపోయినట్టు కలలు కంటారు. మరికొందరు ఆకాశంలో ఎగురుతున్నట్టు కలలు కంటారు. మీ కలలో మీరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తే.. దానికి అర్థం ఏంటో తెల్సా.? ఈ కల అదృష్టాన్ని సూచిస్తుందా.? లేదా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులకు సంకేతమా.? అనే విషయాలు తెలుసుకుందామా..
ఒక వ్యక్తి నిద్రపోయేటప్పుడు అనేక వింత కలలు కంటుంటాడు. అసలు అలాంటి కలలు ఎందుకొచ్చాయ్.? లేదా కలలో కనిపించిన వ్యక్తులు అసలు ఎవరు.? ఇలా కొన్ని కలలకు ఆశ్చర్యపోతుంటారు కొందరు. కలల శాస్త్రం ప్రకారం, మీరు కలలో గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తే.. అది శుభానికి సంకేతం అని చెప్పొచ్చు. అలాంటి కల మీకు వస్తే.. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా తమ కలలో గాలిలో ఎగురుతున్నట్లు చూస్తే.. వారి పెండింగ్ పనులు కొన్ని త్వరలో పూర్తవుతాయని అర్థం. కలలో ఎగురుతున్నట్లు చూసేవారు జీవితంలో విజయం సాధిస్తారు. వారు తమ పని, వ్యాపారం, ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీరు కలలో ఎగురుతున్నట్లు చూడటం అంటే మీరు జీవితంలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని అర్థం.
ఒక వ్యక్తి తాను ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు కలలో చూస్తే, ఆ వ్యక్తికి ఆరోగ్య సంబంధిత సమస్య ఉందని అర్థం. అతను తన శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. మీరు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. కలలో జరిగే కొన్ని సంఘటనలు మన జీవితాల్లో కూడా జరుగుతాయి. అందువల్ల జాగ్రత్త వహించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..