AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెంపుడు కుక్క నడత మారింది.. విసుక్కుంటూ కనిపించింది.. డౌట్ వచ్చి ఎక్స్‌రే తీయగా

ఆ జంట పెంచుకునే పెంపుడు కుక్క ఎప్పుడూ యాక్టివ్ గా ఇల్లంతా కదులుతూ కనిపించేది. అయితే మొన్నీమధ్య క్లినిక్ కు తీసుకెళ్లిన కొద్దిరోజుల తర్వాత నుంచి మూడీగా ఉంది. ఏమైందో.. ఏంటో తెలియదు.. మళ్ళీ మాములు అయిపోతుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత

Viral: పెంపుడు కుక్క నడత మారింది.. విసుక్కుంటూ కనిపించింది.. డౌట్ వచ్చి ఎక్స్‌రే తీయగా
Viral
Ravi Kiran
|

Updated on: Feb 13, 2025 | 8:10 PM

Share

డాక్టర్లు అంటేనే దేవుళ్లతో సమానం అని అంటారు. అలాంటి వైద్యులు ప్రతీరోజూ చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో సాల్వ్ చేస్తుంటారు. కడుపులో నుంచి జుట్టు బయటకు తీయడం.. లేదా గొంతులో కాయిన్ ఇరుక్కుపోవడం.. లేదా మరేదైనా శరీర భాగంలో ఏదైనా చొచ్చుకుపోవడం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఈ తరహ ఘటన ఒకటి ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. బ్రిటన్ డాక్టర్లు అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి.. 13 ఏళ్ల కుక్కపిల్లకు పునర్జన్మను అందించారు.

వివరాల్లోకి వెళ్తే.. 13 ఏళ్ల డాలీ(కుక్కపిల్ల)లో మార్పు కనిపిస్తోందని.. దాని యజమానులు బెవర్లీ, టోనీ ఎవరెస్ట్ పసిగట్టారు. ఎప్పుడూ ఒకే దగ్గర ఏదో పోగొట్టుకున్న దానిలా పడుకునే ఉండటం.. ప్రతీసారి విసుక్కుంటూ కనిపించడం లాంటివి చేయడంతో.. కుక్కపిల్లకు ఏదో అయ్యిందని అనుకున్నారు. అయితే ఇటీవలే దానికి కొన్ని దంతాలు తీయించడంతో.. బహుశా కుక్కపిల్లలో మార్పు దీని వల్ల అయి ఉండొచ్చునని అనుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా.. కుక్కపిల్ల మళ్లీ తిరిగి యాక్టివ్‌గా ఆడుకోవడం, తిరక్కపోవడంతో.. వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ స్థానికంగా ఉన్న వెట్‌కు చెకప్ నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడున్న డాక్టర్లు కుక్కపిల్ల పొత్తికడుపును తాకుతున్నప్పుడు.. అది ముఖం చిట్లించడం లాంటి హావభావాలు గమనిస్తారు. వెంటనే ఎక్స్‌రే తీసి చూడగా.. వారంతా దెబ్బకు షాక్ అయ్యారు.

నికోటిన్‌తో నిండిన బ్యాటరీ లాంటి డివైస్ ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన గ్యాస్ట్రోటోమి(అరుదైన శస్త్రచికిత్స) నిర్వహించి.. ఆ వాపె పోడ్(Vape Pod)ను తొలగించారు. ఆపరేషన్ చేసిన వెటర్నరీ డాక్టర్ సర్ల బల్సే మాట్లాడుతూ..’ఇలాంటి పరికరాలు అప్పుడప్పుడూ కుక్కలు తెలియకుండా మింగేస్తుంటాయి. సంతోషకరమైన విషయం ఏంటంటే..! డాలీ మింగేసిన ఆ పరికరంలోని నికోటిన్.. దాని పొత్తికడుపులో రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ అయ్యి ఉంటే.. చనిపోయేది’ అని అన్నారు. కాగా, ప్రస్తుతం కుక్కపిల్ల ఆరోగ్యకరంగానే ఉందని.. కొద్దిరోజులు దాని కదలికలు గమనించాక.. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు వైద్యులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!