AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో

అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో

Samatha J
|

Updated on: Feb 13, 2025 | 7:05 PM

Share

ఒక అలసిపోయిన సింహం చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, సింహం నిద్రపోతుండగా, ఒక జింక శవం చెట్టు నుండి కిందపడింది. ఆశ్చర్యకరంగా, సింహం ఆ జింకను తినలేదు. ఈ ఘటనకు వివిధ రకాలైన వివరణలు ఇస్తున్నారు. కొందరు సింహం అలసిపోయి ఉండటం వల్ల ఆకలి లేదని అంటున్నారు, మరికొందరు సింహం ఇతర జంతువులు వేటాడిన ఆహారాన్ని తినదని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను 14.7 మిలియన్ల మందికి పైగా వీక్షించారు మరియు 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వీడియోలోని సింహం ప్రవర్తన ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సఫారీ ఏరియా అనుకుంటా అక్కడక్కడ చెట్లుండి మిగతా ప్రాంతమంతా ఖాళీగా గడ్డితో ఉంది. పైన ఎండ మండిపోతోంది. ఇంతలో ఒక సింహం అక్కడికి వచ్చింది. ఎండ తీవ్రతకు అది బాగా అలసిపోయినట్లుంది. ఆ చెట్టు నీడన సేద తీరేందుకు వెళ్లింది. అక్కడ నిలిచి సేద తీర్చుకున్నాక కాసేపు పడుకుందామని నిద్రకు ఉపక్రమించింది. ఇంతలో ఆ చెట్టు పైనుంచి ఏదో దొబ్బున పడింది. ఒక్కసారిగా సింహం ఉలికిపడి లేచింది. ఏదైనా జంతువు తనపై అటాక్ చేసేందుకు వస్తుందా అన్నట్లుగా చుట్టూ పరికి చూసింది. కానీ చూపు మేరలో ఏదీ కనిపించలేదు. అనుమానం తీరక చెట్టు పైకి చూసింది. అక్కడ ఏమీ కనిపించలేదు. మెల్లగా లేచి చెట్టు పైనుంచి పడిందేమిటో చూద్దామని అక్కడికి వెళ్లింది సింహం. దగ్గరికి వెళ్లి చూడగా అదొక జింక కళేబరం. అయినా దానిని సింహం తినలేదు. అయినా వేరే జంతువు వేటాడిన ఆహారాన్ని సింహం తినదనుకోండి. సింహం వేటాడితే మామూలుగా ఉండదు. అందులోనూ అడవికి రాజు కదా. ఎంత పెద్ద జంతువైనా ఆవలీలగా వేటాడేయగలదు. అలాగే దాని కడుపు నిండిందంటే తన పక్కనుంచి వెళుతున్న ఎవరినీ ఏమీ చెయ్యదు సింహం.