భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో
విజయనగరం జిల్లా ఎల్కోట మండలం లింగంపేటకు చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళను రాత్రి పాము కాటేసింది. ఆమెను వెంటనే ఎల్కోట ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణమే చికిత్స అందించడంతో ఆమె ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. పాము కాటు వేసిన తర్వాత, ఆ పాము మృతి చెందినట్లు కనిపించింది. వైద్యులు ఈ ఘటనపై వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాత్రం సత్యవతిని కరవడం వల్లే పాము చనిపోయిందని నమ్ముతున్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
విజయనగరం జిల్లా ఎల్కోట మండలం లింగంపేటకు చెందిన నందిపల్లి సత్యవతి అనే మహిళ రాత్రి 8 గంటల ప్రాంతంలో బహిర్భూమి కోసం ఇంటి సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళింది. అలా వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా ఒక పాము సత్యవతిని కాటేసింది. దీంతో భయపడ్డ సత్యవతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగు పరుగున ఆమె వద్దకు వెళ్ళారు. పాము కాటేసిన విషయం వారికి తెలియజేయడంతో హుటాహుటిన ఎల్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యం అందించడంతో సత్యవతికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సత్యవతి కోలుకుంటోంది. సత్యవతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలియజేశారు. సత్యవతిని పాము కాటు వేసిన ప్రాంతాన్ని సత్యవతి భర్త సన్యాసి అయ్య మరికొందరు పరిశీలించారు. అలా వెళ్ళిన వారు అక్కడ ఎదురైన దృశ్యాన్ని చూసి కంగుతిన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. ఏంటా అని చూడగా వీడియో
తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..ఏం చేశారంటే..! వీడియో
ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!