రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. ఏంటా అని చూడగా వీడియో
ఘన చరిత్ర కలిగిన కాకతీయుల ఆనవాళ్లు ఇప్పటికీ తవ్వకాల్లో బయటపడుతూ.. తమ వైభవాన్ని చాటుతున్నాయి. తాజాగా ఖమ్మంలో కాకతీయుల కాలం నాటి ఖడ్గం ఒకటి బయటపడింది. ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలికి తగిలింది ఈ ఖడ్గం.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో పురాతన వీరభద్రస్వామి ఆలయం ఉంది..అక్కడ సమీపంలోనే ఆ రైతు పొలం ఉంది. ప్రతి రోజూ లాగానే ఆ రైతు తన పొలానికి వెళ్ళాడు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యాడు. నాగలి కట్టి రైతు పొలం దున్నుతుండగా ఆ నాగలికి ఏదో తగిలి ఆగిపోయింది. ఏమై ఉంటుందా అని వెలికి తీసి చూసిన అతను ఆశ్చర్యపోయాడు. అందులో ఓ ఖడ్గం బయటపడింది.
అది కాకతీయుల కాలం నాటి ఖడ్గంగా గుర్తించారు. తుంబూరు గ్రామంలో ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయం కాకతీయుల కాలం నాటిది కావడంతో అలనాటి ఆనవాళ్ళు తవ్వకాల్లో బయటపడుతున్నాయని చర్చించుకుంటున్నారు స్థానికులు. లభించిన ఖడ్గం పూర్తిగా శిధిలమై ఉండటంతో ఆలయంలోనే భద్రపరిచారు. అయితే గత 15 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో గతంలో కూడా వీరభద్ర స్వామి వారి పంచలోహ విగ్రహం లభించింది. ఇప్పుడు పురాతన ఖడ్గం లభించడంతో తుంబూరు గ్రామస్థులు ఆశ్చర్య పోతున్నారు. కాకతీయుల కాలానికి చెందిన పురాతన వస్తువులు ఇంకా దొరుకుతాయేమోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. బయట పడిన ఖడ్గాన్ని చూడటానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పురాతన కాలం నాటి ఆలయాలు ,కాకతీయుల కాలం లో వాడిన వస్తువులు ఆనవాళ్లు తరచూ ఇక్కడ కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
మహిళకు ఫ్లయింగ్ కిస్..ఎమ్మెల్యే పై కేసు
చలిమంట ఇలా కూడా కాచుకుంటారా?వీడియో
ఇంత దారుణమా?కన్న కొడుకుని కడతేర్చిన తండ్రి వీడియో
చెవులు కుట్టించబోతే చనిపోయిన బిడ్డ.. అసలేం జరిగింది? వీడియో
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ
