మహిళకు ఫ్లయింగ్ కిస్..ఎమ్మెల్యే పై కేసు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా.. ఒక మహిళ పట్ల తీవ్ర అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు న్నాయి. ప్రచారానికి వెళ్లిన దినేష్ మోహానియా.. ఒక మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న వార్త ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు. దినేష్ మోహానియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఢిల్లీలో 70 స్థానాలకు గానూ ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించారు. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి.
ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓ ఆప్ ఎమ్మెల్యే తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ మహిళ పట్ల ఆ ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఢిల్లీలోని సంగం విహార్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దినేష్ మోహానియా.. తాజాగా మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తన నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన దినేష్ మోహానియా.. ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను చూస్తూ సైగలు చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. ఆ తర్వాత ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో.. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళ.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
