ఇంత దారుణమా?కన్న కొడుకుని కడతేర్చిన తండ్రి వీడియో
మద్యం మత్తులో చేసిన పని.. ఓ తండ్రికి కడుపు కోత మిగిల్చింది. మద్యం మత్తులో కన్న కొడుకును కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్టా సైదులు దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఉన్నంతలో తమ పిల్లలను చదివించి పెద్ద చేయాలని భావించారు. పిల్లలను తమ స్థాయికి మించి ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు.
అయితే కొంతకాలంగా తండ్రి సైదులు మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు.చిన్న కొడుకు భాను చౌటుప్పల్ లోని ఓ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ లో జరిగిన ఫేర్‌వెల్ పార్టీలో భాను కూడా పాల్గొన్నాడు. దీంతో రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు ఆగ్రహంతో కొడుకు భానును చితకబాదాడు. భాను ఛాతిపై దెబ్బలు బలంగా తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భానును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు.పోస్టుమార్టం అవసరం లేదని మృత దేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు.
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
