డమ్మీ కాదురా డైనోసార్ అక్కడ.! 44 సిక్సర్లు, 53 ఫోర్లతో 645 పరుగులు.. ధోనికే పిచ్చెక్కించేసాడుగా
ధోని టీంలోకి వచ్చిన ఆ ప్లేయర్.. వరుసగా సిక్సర్లతో అదరగొట్టాలని అనుకున్నాడు. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా సీఎస్కే జట్టు అతడ్ని రిలీజ్ చేసింది. దీంతో డొమెస్టిక్ టోర్నమెంట్లలో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. ఈ సీజన్‌లో అతడు వేరే టీం తరపున ఆడనున్నాడు. అతడు మరెవరో కాదు సమీర్ రిజ్వీ. వేలానికి ముందుగా సీఎస్‌కే అతడ్ని రిలీజ్ చేసింది. చెన్నై ఇలా రిలీజ్ చేసిందో.. లేదో.. రిజ్వీ డొమెస్టిక్ అండర్-23 ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ కల్నల్ CK నాయుడు ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు 10 ఇన్నింగ్స్‌లలో 71 సగటుతో 645 పరుగులు చేశాడు. ఇక రీసెంట్ మ్యాచ్‌లో 93 బంతుల్లో 134 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టు ఉత్తర ప్రదేశ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు.
సిక్సర్లు, ఫోర్ల వర్షం..
ఈ టోర్నీలో సమీర్ రిజ్వీ సూపర్బ్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 132 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు కేవలం 487 బంతుల్లో 645 పరుగులు చేశాడు. ఇది మాత్రమే కాదు, CK నాయుడు ట్రోఫీలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు అతడి బ్యాట్ నుంచి 44 సిక్సర్లు, 53 ఫోర్లు వచ్చాయి. ఇందులోనే సమీర్ రిజ్వీ 3 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో పాటు 2 డబుల్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఇక ఈ రైట్ ఆర్మ్ బ్యాటర్ ఫామ్ చూసి.. CSK జట్టు షాక్ అవుతోంది. ఇదిలా ఉంటే.. IPL 2024కి ముందు CSK అతన్ని రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ 2025 వేలానికి ముందే.. ఆ జట్టు సమీర్ రిజ్వీని విడుదల చేసింది. దీంతో ఢిల్లీ అతడిని కేవలం రూ. 95 లక్షలతో సొంతం చేసుకుంది.
జట్టును సెమీఫైనల్స్ వరకు..
CK నాయుడు ట్రోఫీలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మధ్య ఫిబ్రవరి 13న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ ఉత్తరప్రదేశ్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన రిజ్వీ.. కేవలం 93 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, అతడి నుంచి 10 సిక్సర్లు, 9 ఫోర్లు వచ్చాయి. అదే కాదు.. దీని ముందు మ్యాచ్‌లు.. విదర్భపై 105 బంతుల్లో 202 పరుగులు, గుజరాత్‌పై 159 బంతుల్లో 259 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..