ఏం తాగి కొట్టావ్ అన్నా.! 61 బంతుల్లో డబుల్ సెంచరీ.. 26 సిక్సర్లతో ఊచకోత మాములుగా లేదుగా
అంతర్జాతీయ కెరీర్ పెద్దగా లేదు. ఐపీఎల్‌లో మాత్రమే అదరగొడుతున్నాడు. కట్ చేస్తే.. డొమెస్టిక్ టీ20లో సెంచరీ కాదు.. ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ టీంలో ఆడుతున్న ఈ గంభీర్ శిష్యుడు.. ఏ మ్యాచ్ లో కొట్టాడో తెలిస్తే..

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇండోర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 61 బంతుల్లో 225 పరుగులు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడి బ్యాట్ నుంచి 26 సిక్సర్లు వచ్చాయి. అంటే కేవలం సిక్సర్ల ద్వారానే 156 పరుగులు రాబట్టాడు. ఇండోర్‌లోని లోకల్ ఎ-గ్రేడ్ క్రికెట్ క్లబ్ T-20 టోర్నీలో ఎంవైసీసీ Vs స్వామి వివేకానంద క్రికెట్ అకాడమీ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ పరుగుల ఊచకోత కోశాడు.
అయ్యర్ దూకుడైన బ్యాటింగ్..
వెంకటేష్ అయ్యర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్‌లో కూడా అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు బరిలోకి దిగుతాడు. అలాగే మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు, ఇందుకే కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 వేలంలో వెంకటేష్ అయ్యర్ రూ. 23.75 కోట్లు పలికాడు. మరోవైపు జనవరి 23న వెంకటేష్ అయ్యర్ తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు, దీనిలో అతడు కేరళపై 42, 80 నాటౌట్‌గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో వచ్చేసి.. అతడి అత్యుత్తమ స్కోర్ కేవలం 18 పరుగులు మాత్రమే. ఇలాంటి సమయంలో అతడు డొమెస్టిక్ టీ20 టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టి.. అదరగొట్టాడు. ఇక వెంకటేష్ అయ్యర్ అంతర్జాతీయ గణాంకాల విషయానికొస్తే.. తన చివరి వన్డే 21 జనవరి 2022న ఆడాడు. చివరి T20 మ్యాచ్‌ను ఫిబ్రవరి 27, 2022న ఆడాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..