వాటే విజన్.. వాటే థాత్.. పిచ్చోళ్లు అయిపోయారన్నా.. ఇద్దరు భార్యల కోసం ఈ ముద్దుల మొగుడు ఏం చేశాడంటే
తగాదాలు, కొట్లాటలు ఉన్న సందర్భాల్లో ఇళ్లు, ఆస్తుల విభజన గురించి వినే ఉంటారు. కానీ మేము చెప్పబోయేది వింత సంఘటన. ఇది బీహార్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ఇద్దరు భార్యలు వారంలో చెరో మూడో రోజుల చొప్పున భర్తను పంచుకున్నారు. మరి ఆ సీక్రెట్ అగ్రిమెంట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. ఓ లుక్కేయండి.

తోబుట్టువులు, కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులకు చెందిన భూములు, ఆస్తులు, బంగారం, వెండి లాంటివి పంచుకోవడం చూసి ఉంటారు. ఏదైనా గొడవ కారణంగా ఇంటిలో లేదా భూమిలో సగం భాగం నీది, సగం భాగం నాది లాంటి అగ్రిమెంట్స్ చేసుకుంటుంటారు. అయితే ఇక్కడొక వింత సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. వారిద్దరికీ వారానికి మూడు రోజుల చొప్పున షెడ్యూల్ ఇచ్చాడు. ఓ మహిళకు వారంలో మూడు రోజులు.. మరో మహిళకు వారంలో మూడు రోజులు.. అతడికి ఓ రోజు వీకాఫ్ లెక్క.. షెడ్యూల్ పెట్టుకున్నాడు. ఇది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్‌లోని పూర్ణియాలో చోటు చేసుకున్న ఈ వింత సంఘటనపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. భర్త వారానికి మూడు రోజులు ఒక వైఫ్ దగ్గర.. మరో మూడు రోజులు ఇంకో వైఫ్ దగ్గర ఉంటాడు. అసలు ఈ అగ్రిమెంట్ ఎందుకు జరిగిందంటే.. సదరు వ్యక్తి మొదటి భార్యకు చెప్పకుండానే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య కాస్తా.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఈ ముగ్గురిని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పంపించారు. అక్కడ ఇద్దరు భార్యలను భర్త సరిసమానంగా చూసుకోవాలని అగ్రిమెంట్ పెట్టుకున్నారు. మొదటి భార్యతో మూడు రోజులు.. రెండవ భార్యతో మరో మూడు రోజులు గడపాలని.. ఇక మిగిలిన ఒక రోజు ఇద్దరు భార్యలలో తనకు నచ్చిన వారితో భర్త గడపవచ్చని ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అధికారులు చెప్పారు. దీనికి వారంతా కూడా ఒప్పుకున్నారు.
పోలీసులను ఆశ్రయించిన మొదటి భార్య..
దాదాపు ఏడు సంవత్సరాల క్రితం, సదరు వ్యక్తి తన మొదటి భార్యకు చెప్పకుండా రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం గురించి మొదటి భార్యకు తెలియగానే, ఆమె షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం ఏంటని.? తనను, తన పిల్లలను సరిగ్గా చూసుకోవడం లేదని భర్తపై ఆరోపణలు చేసింది. దీంతో ఈ వింత కేసును పూర్ణియా ఎస్పీ కార్తికేయ శర్మ స్థానిక ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు అప్పగించారు.
ఇక ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో, మొదటి భార్య తన భర్త విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేసుకున్నాడని.. తను, తన పిల్లల పరిస్థితి ఏంటని గగ్గోలు పెట్టింది. ఈ తరుణంలో భర్త తన తప్పును గ్రహించి.. మొదటి భార్యను స్వీకరించాలనుకున్నప్పుడు.. అతడ్ని రెండో భార్య ఆపింది. ఇలా ఇద్దరి భార్యల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. దీంతో ఈ వింత సంఘటనకు చక్కటి పరిష్కారాన్ని ఆలోచించారు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ సభ్యులు.. వారంలో చెరో మూడు రోజుల చొప్పున భర్తను పంచుకోవాలని ఇద్దరి భార్యలకు తెలిపారు. ఇక మిగిలిన ఒక రోజు.. అతడు ఎక్కడ కావాలంటే అక్కడ గడపవచ్చు. అంతేకాకుండా మొదటి భార్య పిల్లల చదువు, ఆహారం కోసం ప్రతి నెలా రూ.4,000 చెల్లించాలని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ సభ్యులు చెప్పారు. ఈ నిర్ణయానికి ఇద్దరు భార్యలు అంగీకరించారు. సో.. అలా ఈ వింత కథకు సుఖాంతమైన క్లైమాక్స్ దక్కింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి