దారుణం.. కోడలికి హెచ్‌ఐవీ వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చి
టెక్నాలజీ యుగంలోనూ సమాజంలో మార్పు రావడంలేదు. మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అదనపు కట్నం కోసం భార్యను చిత్ర హింసలు పెట్టే భర్తలు కొందరైతే.. కోడలికి నరకం చూపించే అత్తమామలు కొందరు.
తమ కూతురు కూడా ఒకింటి కోడలేనన్న ఇంగితంలేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఉత్తరప్రదేశ్‌లో అదనపు కట్నం కోసం అత్తమామలు కోడలికి హెచ్ఐవి వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి కోర్టును ఆశ్రయించారు. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువతికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో 2023లో వివాహమైంది. వివాహ సమయంలో వరుడికి రూ15 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు వధువు తల్లిదండ్రులు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వధువు భర్త, అత్తమామలు తమ కోర్కెలు తీర్చుకోడానికి కోడలిని వేధించడం మొదలు పెట్టారు. కారు కొనుక్కోవడం కోసం పుట్టింటి నుంచి మరో రూ.25 లక్షలు తీసుకురావాలని సచిన్ తన భార్యకు చెప్పాడు. ఆమె కాదనడంతో అత్తమామలు కోడలిని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తాము అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పారు. దీంతో యువతిని ఇంటినుంచి గెంటేశారు భర్త, అత్తమామలు. ఆ యువతి తల్లిదండ్రులు గ్రామ పెద్దలను ఆశ్రయించండంతో వారు గ్రామంలో పంచాయతీ పెట్టి సచిన్ కుటుంబానికి సర్ధిచెప్పి తిరిగి యువతిని అత్తింటికి పంపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ వయసును తగ్గించే ఆహారాలు ఇవే.. మీ ముఖంలో ఎప్పటికీ యవ్వనపు మెరుపు
Rashmika Mandanna: ‘ఊరిస్తూ.. ఇంకెన్నాళ్లు ఈ ప్రేమాయణం’
Manchu Manoj: సంచలన వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్
Chhaava: సంచలనంగా ఛావా కలెక్షన్స్ !! కోట్లు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ..!
మూడు రోజులుగా ఆసుపత్రిలో… అయినా మాట కోసం బయటికి వచ్చిన సుధీర్