ఆకాశాన్నంటుతున్న కోడిగుడ్దు ధర.. ఎక్కడో తెలుసా?
ఓవైపు బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుండటంతో చికెన్, కోడిగుడ్లు తినొద్దని చెబుతుంటే.. మీరేంటి కోడిగుడ్డు ధర ఆకాశాన్నంటుతుందంటున్నారు అనుకుంటున్నారా? కోడిగుడ్డు ధర పెరిగింది ఇండియాలో కాదు.. అమెరికాలో. అగ్రరాజ్యంలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉందట. దీంతో గుడ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయట. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ధరలు 15 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోడిగుడ్ల కొరత కారణంగా చాలా స్టోర్లలో 'లిమిటెడ్ స్టాక్' బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే, 'నో స్టాక్' బోర్డులు కూడా కనిపిస్తున్నాయి.
కొనుగోలుదారులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు కోడిగుడ్ల ట్రేలను మాత్రమే విక్రయిస్తున్నారు.శాఖ గణాంకాల ప్రకారం, బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా గత ఏడాది డిసెంబర్ నెలలో సుమారు 2.3 కోట్ల కోళ్లను చంపేసారు. దీంతో గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోవడంతో గతేడాది కూడా గుడ్ల ధర భారీగా పెరిగింది. 2024 జనవరిలో ఒక కోడిగుడ్డు ధర 2.52 డాలర్లు ఉండగా, డిసెంబర్ నాటికి అది 4.15 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ ధర 7.34 డాలర్లకు చేరుకుందని అమెరికా లేబర్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కోడిగుడ్ల ధర 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని సమాచారం. గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే స్టోర్స్‌లో ‘నో స్టాక్’ లేదా ‘లిమిటెడ్ స్టాక్’ బోర్డులు పెడుతున్నారు. కోడిగుడ్ల కొరత, ధరల పెరుగుదల హోటల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా రెస్టారెంట్లు గుడ్డుతో చేసే వంటకాలపై 50 శాతం అదనపు ఛార్జీని వసూలు చేస్తున్నట్టు సమాచారం.

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
