వ్యక్తిని అమాంతం మింగేసిన భారీ తిమింగలం ..అంతలోనే ..
కయాకింగ్ లాంటి సముద్ర క్రీడ ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో.. అప్పుడప్పుడూ అంతే స్థాయిలో భయాన్నీ కలిగిస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సొర చేపలు, తిమింగలాల రూపంలో ప్రమాదం పొంచి ఉంటుంది. చాలా మంది వీటి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటారు. ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కయాకింగ్ చేసేందుకు కడలికి వెళ్లిన ఓ యువకుడిపై తిమింగలం దాడి చేసి అతన్ని అతని బోటును మింగేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
చిలీలోని పటగోనియా సముద్ర తీరంలో ఘటన జరిగింది. డేల్, ఆడ్రియన్ అనే తండ్రీకొడుకులు కలిసి చిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. విడిగా కయాకింగ్ చేస్తున్న ఆడ్రియన్ పడవను ఓ పెద్ద తిమింగలం అటాక్ చేసింది. బోటు పక్కగా వచ్చి నోరు తెరచింది. దీంతో యువకుడు చూస్తుండగానే పడవతో పాటూ తిమింగలం నోట్లోకి వెళ్లిపోయాడు. తన కొడుకు తిమింగలం లోపలికి వెళ్లడం చూసిన తండ్రి డేల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే అంతలోనే ఆశ్చర్యం జరిగింది. తిమింగలం ఏమనుకుందో ఏమో కానీ .. ఆడ్రియన్‌ని పడవతో సహా బయటకు ఉమ్మి వేసింది. కాసేపటికే బోటుతో సహా ఆడ్రియన్ నీటిపై తేలియాడాడు. కొడుకు ప్రాణాలతో బయటపడేసరికి తండ్రి డేల్ ఎంతో మురిసిపోయాడు.తన కొడుకును పడవలోకి ఎక్కించుకున్నాడు. కొడుక్కి ధైర్యం చెప్పిన తండ్రి.. పడవను వేగంగా నడుపుతూ దూరంగా తీసుకెళ్లాడు. ఇద్దరూ సురక్షితంగా అక్కడ్నుంచి బయటపడ్డారు. ఈ ఘటన మొత్తాన్ని తండ్రి డేల్ రికార్డ్ చేసాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
