తండ్రిని చంపారని బోరుమన్న కొడుకు.. కట్ చేస్తే.. విచారణలో ఏం తేలిందంటే..!
ఓ హత్య కేసు ఇప్పుడు ఓ కుటుంబంలో సెగలు రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని ములకలపెంట గ్రామంలో జరిగిన హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న పంట పొలం దగ్గర కడియం శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద స్థితిలో మొక్కజొన్న తోటలో శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. భూ తగాదాలే హత్యకు కారణమని.. ఓ టీడీపీ నేత అనుచరులే చంపారని కొడుకు పుల్లారావు.. హత్య జరిగిన రోజు ఆందోళన చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొడుకు పుల్లారావే తన తండ్రి శ్రీనివాసరావుని హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందంటున్నారు పోలీసులు. ఎంబీఏ చేసిన పుల్లారావు చదువుకునే సమయంలో.. పేకాట, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని ఏసీపీ ప్రసాదరావు చెప్తున్నారు. అప్పులు చేయడంతో తండ్రి శ్రీనివాసరావు.. పుల్లారావును ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయం చేయిస్తున్నాడని.. ప్రతీ చిన్నదానికి తండ్రిపై డిపెండ్ కావడం, ఇంట్లో గొడవలతో తండ్రిని హత్య చేసినట్లు తేలిందన్నారు. తన భర్తను కావాలనే.. కేసులో ఇరికించారంటున్నారు పుల్లారావు భార్య. తన మామకు, భర్తకు ఎటువంటి గొడవలు లేవని చెప్పడం ఇక్కడ మరో ట్విస్ట్‌గా మారింది. తమకు ఇద్దరు పసిపిల్లలని..అధికార పార్టీ నేతల ఒత్తిడితో భర్తను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె బావురుమంటున్నారు.
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

