ఓర్నీ..బస్సులో ఇలా కూడా ప్రయాణించొచ్చా!వీడియో
సాధారణంగా రైళ్లలో ప్రయాణించేటప్పుడు ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని బెర్త్‌లు కన్‌ఫర్మ్ చేసుకొని ప్రయాణిస్తుంటారు. ఇక పండుగలప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా జనరల్ ప్రయాణికులు కూడా రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కేసి ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చుని ప్రయాణిస్తుంటారు. జనరల్ బోగీల్లో అయితే లగేజ్ కోసం ఏర్పాటు చేసిన చోటకూడా కూర్చుని ప్రయాణిస్తుంటారు కొందరు. రైళ్లలో ఇది సహజం.
బస్సులో కూర్చోడానికి ప్లేస్ లేదని ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే అవాక్కవుతారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎక్కడికో వెళ్తూ ఓ బస్సు ఎక్కాడు. ఆ బస్సు చూస్తే ఫుల్ రద్దీగా ఉంది. కూర్చోడానికి ఎక్కడా సీట్లు ఖాళీలేవు. నిలబడే ప్రయాణించాలి. కొంతదూరం నిలబడి ప్రయాణించిన అతను అబ్బా ఎంతసేపు ఇలా నిలబడాలి అనుకున్నాడో ఏమో.. మరోసారి బస్ అంతా పరిశీలించి చూశాడు… ఎక్కడా సీటు ఖాళీ అవలేదు. పైకి చూశాడు. అక్కడ లగేజ్ పెట్టే ర్యాక్ మీద అతని దృష్టి పడింది. వెంటనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది..క్షణం ఆలోచించకుండా దానిపైకి ఎక్కి తాపీగా పడుకున్నాడు. రైల్లో లగేజీ ర్యాక్‌పై పడుకుని ప్రయాణం చేసినట్టుగా బస్సులో పడుకుని ప్రయాణం చేయడం చూసి అంతా నవ్వుకున్నారు. ఇది బస్సు అనుకున్నావా.. రైలు అనుకున్నావా అంటూ అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 3 లక్షలమందికి పైగా వీక్షించారు. 10వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్టు తెలుస్తోంది.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

