మీ వయసును తగ్గించే ఆహారాలు ఇవే.. మీ ముఖంలో ఎప్పటికీ యవ్వనపు మెరుపు
వయసు పెరిగే కొద్దీ ముఖంలో సహజ కళ తగ్గిపోతుంది. ముఖంపై ముడతలు రావడం కనిపిస్తుంది. చర్మం సాగిపోవడం, పిగ్మెంటేషన్ సమస్యలు బయటపడతాయి. మారిన ముఖచిత్రంతో మీకు కొంత ఆందోళన, దిగులు ఉండటం సహజం. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కొన్ని యాంటీ ఏజింగ్ పండ్లు , కూరగాయలు మిమ్మల్ని మళ్ళీ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
మీరు ఎంత వయసు పెరిగినా, నవ యవ్వనంగా కనిపించవచ్చు. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు వస్తుంటాయి. మధుమేహం, అధిక బరువు, హార్మోన్లలో మార్పులు, యాంగ్జైటీ, డిప్రెషన్‌తో పాటు కొన్నిసార్లు చర్మం ముడతలు పడి ముఖం కళావిహీనంగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E మెండుగా ఉండే అద్భుత ఫలం అవకాడో. దీన్ని తీసుకోవడం ద్వారా చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ ప్రమాదం కూడా తగ్గుతుంది. బ్లూబెర్రీస్‌లో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ విటమిన్లు హానికారక కాలుష్యం, UV కిరణాల నుండి చర్మానికి పూర్తి రక్షణను ఇస్తాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య లక్షణాలను నెమ్మదిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: ‘ఊరిస్తూ.. ఇంకెన్నాళ్లు ఈ ప్రేమాయణం’
Manchu Manoj: సంచలన వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్
Chhaava: సంచలనంగా ఛావా కలెక్షన్స్ !! కోట్లు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ..!
మూడు రోజులుగా ఆసుపత్రిలో… అయినా మాట కోసం బయటికి వచ్చిన సుధీర్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
