విడాకుల ఖరీదు రూ.60 కోట్లు..! పాపం క్రికెటర్ !
టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడిపోనున్నాడని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై చాహల్ కానీ ధనశ్రీ వర్మ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఈ పుకార్లు షికార్లు చేస్తుండగానే ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకోవడానికి యుజ్వేంద్ర చాహల్ రూ. 60 కోట్లు భరణం చెల్లించనున్నాడన్న మరో వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికి సంబంధించి ఇప్పటికే ధనశ్రీ మధ్య చాహల్ మధ్య చర్చలు జరిగాయని, దీని ప్రకారం యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకు రూ.60 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఇటు చాహల్ కానీ.. అటు ధన శ్రీ కానీ రియాక్ట్ అవ్వాల్సి ఉంది. అయితే వీరి రియాక్షన్ కు సంబంధం లేకుండా ఇప్పుడీ స్టార్ క్రికెటర్ విడాకులు టాపిక్ మరో సారి నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. విడాకుల ఖరీదు అక్షరాల 60 కోట్ల రూపాయలా అనే కామెంట్ చాహల్ ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..
బ్రష్ చేసిన.. వెంటనే నోరు కడుక్కుంటే ఇంత ప్రమాదమా ??
సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. హెల్ప్ చేయండి.. ప్లీజ్
Sai Pallavi: సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్